వ్యాపారం
ఓయ్-చంద్రశేఖర్ రావు
నేడు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. బలహీనమైన డాలర్, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్.. దీనికి ప్రధాన కారణాలు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర 0.05 శాతం తగ్గింది. ICEx బంగారం ధర 1,60,356 రూపాయలకు చేరింది. వెండిది కూడా ఇదే పరిస్థితి. కిలో వెండి 0.31 శాతం తగ్గి 2,68,802 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
ముంబై బులియన్ ఓపెన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,240కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,47,800కు లభించింది. వివిధ ప్రాంతాల్లో నగరంగా బంగారం ధరలు నమోదయ్యాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి రూ. 1,62,360 ధర పలకగా, 22 క్యారెట్లు రూ. 1,48,840గా నమోదైంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, పుణె, కోల్‌కతా వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,61,240, 22 క్యారెట్లు రూ. 1,47,800 వద్ద లభించింది.

అంతర్జాతీయంగా యూఎస్‌ఎస్ స్పాట్ గోల్డ్ 0.8 శాతం పెరిగింది, ఔన్సుకు 5,118.75 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 5,123.30 డాలర్ల వద్ద స్థిరపడింది. డాలర్ విలువ తగ్గడంతో ఇతర కరెన్సీల వారికి బంగారం కొనుగోలు చౌకగా మారింది. ఈ పరిణామాల మధ్య ఈ వారం బంగారం దాదాపు ఒక శాతం మేర నష్టపోయింది. ద్రవ్యోల్బణం భయాలు, అధిక చమురు ధరలు కొనసాగితే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే సామర్థ్యంపై సందేహాలు బంగారం కొంతవరకు దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,256, 22 క్యారెట్లు – రూ. 14,900, 18 క్యారెట్లు – రూ. 12,550
ముంబై..
24 క్యారెట్లు – రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు – రూ. 12,093
బెంగళూరు..
24 క్యారెట్లు – రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు – రూ. 12,093
హైదరాబాద్..
24 క్యారెట్లు – రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు – రూ. 12,093
విజయవాడ..
24 క్యారెట్లు – రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు – రూ. 12,093
విశాఖపట్నం..
24 క్యారెట్లు – రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు – రూ. 12,093