వ్యాపారం
ఓయ్-చంద్రశేఖర్ రావు
దేశంలో నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. లాభాల స్వీకరణతో పాటు అమెరికా డాలర్ పసిడి, వెండి రేట్లల్లో తాజా కదలిక చోటు చేసుకుంది. అంతర్జాతీయ పరిణామాలు కూడా వీటి రేట్లపై ప్రభావం చూపాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. బుధవారం నాటితో పోల్చుకుంటే 0.29 శాతం వరకూ తగ్గుదల నమోదైంది.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రామాలకు 1,61,327 రూపాయలకు చేరుకుంది. కిందటి క్లోజింగ్ ట్రేడింగ్ సెషన్‌తో పోల్చుకుంటే ఇందులో 3,000 రూపాయలకు పైగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో, యుఎస్ స్పాట్ గోల్డ్ ధర 0.6 శాతం తగ్గింది, ఔన్సుకు రూ. 5,089 వద్ద ట్రేడ్ అయింది. ఈ వారంలో విడుదల కానున్న కీలక అమెరికా ఆర్థిక డేటా బులియన్ మార్కెట్ పై ప్రభావం చూపుతోంది. వెండి ధర కిలోకు 0.85 శాతం మేర తగ్గింది. 2,75,479 రూపాయలకు చేరింది.

ముంబైలో మాత్రం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రామాలకు రూ. 1,61,630కి పెరిగింది. 22 క్యారెట్ల బంగారం రూ. 1,48,990కి లభించింది. ఢిల్లీ, జైపూర్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,48,010 కాగా, 24 క్యారెట్లు, రూ. 1,61,540గా ఉంది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,48,110, 24 క్యారెట్లు రూ.1,61,440గా నమోదైంది. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,47,960కి లభించగా, 24 క్యారెట్లు రూ. 1,61,190గా ఉంది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,331, 22 క్యారెట్లు – రూ. 14,970, 18 క్యారెట్లు – రూ. 12,700
ముంబై..
24 క్యారెట్లు – రూ. 16,222, 22 క్యారెట్లు- రూ. 14,870, 18 క్యారెట్లు – రూ. 12,167
బెంగళూరు..
24 క్యారెట్లు – రూ. 16,222, 22 క్యారెట్లు- రూ. 14,870, 18 క్యారెట్లు – రూ. 12,167
హైదరాబాద్..
24 క్యారెట్లు – రూ. 16,222, 22 క్యారెట్లు- రూ. 14,870, 18 క్యారెట్లు – రూ. 12,167
విజయవాడ..
24 క్యారెట్లు – రూ. 16,222, 22 క్యారెట్లు- రూ. 14,870, 18 క్యారెట్లు – రూ. 12,167
విశాఖపట్నం..
24 క్యారెట్లు – రూ. 16,222, 22 క్యారెట్లు- రూ. 14,870, 18 క్యారెట్లు – రూ. 12,167