Thursday, March 12, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణతొలి కారుణ్య మరణం- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన దేశంలో సుప్రీంకోర్టు ధర్మాసనం | కోమాలో...

తొలి కారుణ్య మరణం- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన దేశంలో సుప్రీంకోర్టు ధర్మాసనం | కోమాలో ఉన్న 32 ఏళ్ల హరీష్ రాణాకు ల్యాండ్‌మార్క్ కేసులో పాసివ్ యుథనేషియాకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయ్-చంద్రశేఖర్ రావు

దేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. 13 సంవత్సరాలుగా ‘పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్’ (PVS)లో ఉన్న 31 సంవత్సరాల హరీష్ రాణా మెర్సీ కిల్లింగ్ కు అనుమతి ఇచ్చింది. పాసివ్ యుథనేసియా.. అంటే నిష్క్రియాత్మక దయా మరణం/ కారుణ్య మరణానికి అంగీకరించింది. 2018 కామన్ కాజ్ తీర్పును అమలు చేసింది. కారుణ్య మరణాన్ని ఆమోదించిన మొట్టమొదటి కేసు ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఒక దశలో పార్థీవాలా గొంతు పెగల్లేదు..

తీర్పు పాఠ చదివి వినిపించే సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్ధీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఒక దశలో పార్థీవాలా గొంతు పెగల్లేదు. గద్గదిపోయింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా వైద్య సహాయం తొలగింపుపై స్పష్టతనిచ్చింది. హరీష్‌కు వైద్య సహాయం తొలగించడం మానవతా దృక్పథంతో కూడిందని, చట్టబద్ధంగా ఆమోదయోగ్యమని కోర్టు స్పష్టం చేసింది.

కోమాలో ఉన్న 32 ఏళ్ల హరీష్ రాణాకు ల్యాండ్‌మార్క్ కేసులో పాసివ్ యుథనేషియాకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.

యూనివర్సిటీ విద్యార్థి హరీష్ రాణా..

పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి హరీష్ రాణా. 2013లో తాను ఉంటోన్న పీజీ నాలుగో అంతస్తు నుంచి దురదృష్టశావత్తు కింద పడ్డాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మెదడు నరాలు చిట్లాయి. దీంతో ఆయన 100 శాతం క్వాడ్రిప్లెజిక్ వైకల్యానికి సిద్ధమయ్యాడు. కోమాలోకి వెళ్లాడు. గత సంవత్సరాలుగా మంచానికే పరిమితమయ్యాడు. ఎటూ కదల్లేని పరిస్థితి అతనిది. కన్నబిడ్డను కాపాడుకోవడానికి సుదీర్ఘకాలంగా వైద్య చికిత్సను అందిస్తూ రావడం వల్ల అటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆర్థికంగా చితికిపోయారు.

కొడుకు సజీవంగా తిరిగి వస్తాడని..

ఏ ఒక్కరోజైనా చికిత్సను నిలిపివేస్తే హరీష్ ఊపిరి ఆగిపోతుంది. కొడుకు సజీవంగా తిరిగి వస్తాడనే అతని తల్లిదండ్రుల్లో సన్నగిల్లాయి. దీంతో- చికిత్స నిలిపివేయాలని కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మెర్సీ కిల్లింగ్ కు అనుమతిని పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించారు.

విస్తృత చర్చలు..

ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు.. హరీష్ రాణా కుటుంబ సభ్యులు, మెడికల్ బోర్డు, కేంద్ర ప్రభుత్వంతో విస్తృత చర్చలు జరిగాయి. ఈ ఏడాది జనవరిలో తీర్పును రిజర్వు చేసింది. హరీష్ కోలుకునే అవకాశం లేదని డాక్టర్ల బృందం, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి అభిప్రాయపడింది. దీంతో మెర్సీ కిల్లింగ్ పై తుది నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా తన తీర్పును వినిపించింది. హరీష్ రాణాకు అందిస్తోన్న లైఫ్ సపోర్ట్‌ను తొలగించడానికి అంగీకరించింది బెంచ్.

అకుంఠిత దీక్ష, సంరక్షణ బాధ్యతలు..

కొడుకును బతికించుకోవడానికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చూపిన అకుంఠిత దీక్ష, సంరక్షణ బాధ్యతలను సుప్రీంకోర్టు బెంచ్ తన తీర్పులో ప్రశంసించింది. అనేక సంవత్సరాలు గడిచిపోయింది, వారు బాధితుడిని కూడా వదిలిపెట్టకుండా, కంటికి రెప్పలా చూసుకున్న ధర్మాసనం. హరీష్ రాణా కేసులో 2018 నాటి ‘కామన్ కాజ్’ సుప్రీంకోర్టు తీర్పును వర్తింపజేయలేమిన వ్యాఖ్యానించింది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular