Monday, March 9, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంలో ఉద్రిక్తత.. కవిత అరెస్ట్.. | ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల కూల్చివేత బాధితులను కవిత పరామర్శించారు...

ఖమ్మంలో ఉద్రిక్తత.. కవిత అరెస్ట్.. | ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల కూల్చివేత బాధితులను కవిత పరామర్శించారు – నిరసన సందర్భంగా పోలీసులు అదుపులోకి

📰 Generate e-Paper Clip


తెలంగాణ

ఓయ్-బొమ్మ శివకుమార్

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతల బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ మేరకు బాధితులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న కవితను, ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారిని ప్రత్యేక వాహనంలో స్థానిక పోలీస్ స్టేషన్‌కు. అయితే కవిత అరెస్ట్ తో స్థానికంగా ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ఖమ్మంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఖమ్మం నగరంలో వెలుగుమట్ల కూల్చివేత బాధితులను కవిత పరామర్శించారు. నిరసన సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముందస్తు నోటీసులు లేకుండా పోలీసులు కవితను, విశారదన్ మహారాజ్ సహా ఇతర ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అక్కడి నుంచి వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు. వారిపై సెక్షన్ 41 CrPC కింద నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. అయితే రాత్రి 9 గంటల సమయంలో కవిత నేరుగా ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ కు చేరుకుని.. అక్కడ వెలుగుమట్ల నిర్వాసితులతో కలిసి ఆమె నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేసే వరకు ఈ దీక్ష కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ఇదే విషయంపై తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు కవిత. పోలీసులు లేకుండా తమను అదుపులోకి తీసుకున్నారని మహిళా. ఈ ఘటనకు సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అంతకుముందు కవిత మాట్లాడుతూ ఆడబిడ్డల దుఃఖం, వారి కన్నీళ్లు ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. తాను టూరిస్ట్‌గా రాలేదని, సమస్య పరిష్కారమయ్యేదాకా పోరాడతాన’ని వెల్లడించారు. బాధితులకు కూల్చిన చోటే ఇళ్లు కట్టివ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు పేదల పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని స్పష్టం చేశారు.





Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular