అంతర్జాతీయ
ఓయ్-సయ్యద్ అహ్మద్
ఇరాన్ పై ఏకపక్షంగా యుద్ధం ప్రకటించి తాము ఇబ్బందుల్లో పడింది కాక ప్రపంచదేశాల్ని సైతం ఇబ్బందుల్లోకి నెట్టుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (డొనాల్డ్ ట్రంప్) ముఖ్యంగా ఇరాన్ వార్ కారణంగా చమురు ధరల మంట (చమురు ధరల పెంపు) తప్పదన్న సంకేతాల నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టేలా ఉన్నాయి.
ఇరాన్ వార్ నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో చమురు సరఫరా అంతరాయాలు పెరగవచ్చనే ఆందోళనతో పలు దేశాల్లో ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నాలుగేళ్లలో ముడి చమురు ధర బ్యారెల్ కు 100 డాలర్లు చేరుకుంది.
స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఈ పెరుగుదలను ఇరాన్ అణు ముప్పును తొలగించడానికి చెల్లించాల్సిన చిన్న ధర. అలాగే చమురు ధరల పెరుగుదల తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు.

ఇరాన్ అణు ముప్పు నాశనం ముగిసినప్పుడు వేగంగా తగ్గే స్వల్పకాలిక చమురు ధరలు, అమెరికా, ప్రపంచం, భద్రత, శాంతికి చెల్లించాల్సిన చాలా చిన్న ధర అని తన ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ చెప్పారు. మూర్ఖులు భిన్నంగా ఆలోచిస్తారంటూ మరో కొత్త వాదన కూడా తెరపైకి తెచ్చారు. దీంతో చమురు ధరల పెరుగుదల ఖాయమని, ఒప్పందం మాట్లాడే వాళ్లంతా మూర్ఖులే అనేలా ట్రంప్ వ్యాఖ్యలు జరుగుతున్నాయి.

నిజానికి ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి హార్ముజ్ జలసంధిలో సముద్ర రవాణా దాదాపు ఆగిపోయింది . దీని ద్వారానే ప్రపంచ ముడి చమురు, గ్యాస్‌లో 20 శాతం ప్రయాణిస్తుంది. అలాగే గల్ఫ్ చుట్టూ ఉన్న చమురు , గ్యాస్ ఉత్పత్తిదారులు ఉత్పత్తిని తగ్గించడం. టెహ్రాన్‌లోని ఇంధన డిపోలపై ఇజ్రాయెల్ దాడులు పొరుగు దేశాలలోని మౌలిక సదుపాయాలపై ప్రతీకార దాడులను భయపెడుతున్నాయి. ముడి చమురు ధరల పెరుగుదలతో ఇప్పటికే అమెరికాలోని ఇంధన ఖర్చులు పెరిగాయి. ఇది నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలకు దారితీసే అత్యంత సున్నితమైన రాజకీయ సమస్యగా మారిపోయింది. అయినా ట్రంప్ చిన్న విషయమే అంటున్నారు.

