Sunday, March 8, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణనేటి పెట్రోల్, డీజిల్ రేట్లు- మోత తప్పదు? | పెట్రోలు మరియు డీజిల్ రేట్లు: ప్రధాన...

నేటి పెట్రోల్, డీజిల్ రేట్లు- మోత తప్పదు? | పెట్రోలు మరియు డీజిల్ రేట్లు: ప్రధాన భారతీయ రాష్ట్రాలలో తక్షణ ధరల పెంపుదల లేదు, ఇంధన పెరుగుదల సాధ్యమే

📰 Generate e-Paper Clip


వ్యాపారం

ఓయ్-చంద్రశేఖర్ రావు

అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏది మినహాయింపు కాదు. ఈ పరిణామాలు భారత్ కు గుదిబండగా మారాయి. ఇప్పటికే గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లను భారీగా పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఒక్కో సిలిండర్ పై 60 రూపాయలు పెరిగింది.

దీంతో ఇక అందరి దృష్టి కూడా పెట్రోల్ రేట్లపై పడింది. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచవచ్చనే ఊహాగానాలకు తెర లేచింది. పశ్చిమ ఆసియాలో ఘర్షణలు తీవ్రతరం కావడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం దీనికి మరింత బలాన్ని ఇచ్చింది. సరఫరా అంతరాయల భయాల మధ్య, బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ ధర ఎనిమిది కంటే ఎక్కువ పెరిగింది. బ్యారెల్ ఒక్కింటికి 93.04 డాలర్లకు చేరింది. శనివారం నాటితో పోల్చుకుంటే ఎనిమిది శాతం మేర పెరుగుదల కనిపించింది.

ప్రధాన భారతీయ రాష్ట్రాలలో పెట్రోలు మరియు డీజిల్ ధరలు తక్షణ ధరల పెంపుదల ఉండవు, ఇంధన పెరుగుదలలు సాధ్యమే

యూఎస్ బెంచ్‌మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లో సైతం క్రూడ్ ధర జంప్ అయింది. ఏకంగా 12.19 శాతం పెరిగి 90.91 డాలర్లకు చేరింది. ఇది రికార్డు స్థాయి ధర. ఈ మధ్యకాలంలో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో ఈ స్థాయిలో ధరల పెరుగుదల చోటు చేసుకోలేదు. ఇది- దేశీయ పెట్రో రేట్లను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే డొమెస్టిక్ వంటగ్యాస్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో వీటి రేట్లను కూడా కేంద్రం సవరిస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి.

ఈ పరిణామాల మధ్య వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలు ఉన్నాయి.

ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77

కోల్కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41

ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54

చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06

భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94

డీజిల్ ధరలు ఇవీ..

ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67

కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02

ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03

చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61

భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular