Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఇరాన్ లో భారీ భూకంపం- ఏం జరుగుతోంది? | 4.3 తీవ్రతతో భూకంపం ఇరాన్‌లో గెరాష్‌ను...

ఇరాన్ లో భారీ భూకంపం- ఏం జరుగుతోంది? | 4.3 తీవ్రతతో భూకంపం ఇరాన్‌లో గెరాష్‌ను కదిలించింది, యుఎస్-ఇజ్రాయెల్ సమ్మెలు ఉద్రిక్తతలను పెంచుతాయి, భయాలను రేకెత్తిస్తాయి

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

ఓయ్-చంద్రశేఖర్ రావు

అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏది మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టలేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.

ఈ పరిణామాల మధ్య ఇరాన్‌లోని గరాష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కెల్ పై 4.3గా రికార్డు అయింది. గరాష్.. ఇరాన్ ఫార్స్ ప్రావిన్స్‌లోని సిటీల్లో ఒకటి. గరాష్ ప్రావిన్స్ కు రాజధాని. దక్షిణ ఇరాన్ లారెస్తాన్ ప్రాంతంలో ఓ భాగం ఇది. కొద్దిసేపటి కిందటే ఇక్కడ 4. 3 తీవ్రతతో భూమి ప్రకోపించింది. గరాష్ సిటీకి నైరుతి దిశగా గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే.

మాగ్నిట్యూడ్ 4 3 భూకంపం ఇరాన్‌లో గెరాష్‌ను కదిలించింది, యుఎస్-ఇజ్రాయెల్ స్ట్రైక్స్ తీవ్రతరం చేయడంతో ఉద్రిక్తతలు భయాలను రేకెత్తిస్తాయి

సుమారు 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి కంపించినట్లు యూఎస్జీఎస్ గుర్తించారు. ప్రపంచంలోనే అత్యంత భూకంప క్రియాశీలక దేశం.. ఇరాన్. అరేబియా, యూరేషియన్ ప్లేట్ల ఘర్షణ వల్ల ఏర్పడిన జాగ్రోస్ ఫోల్డ్ థ్రస్ట్ బెల్ట్‌లో గరాష్ ఉంది. ఈ ప్రాంతంలో 4 నుండి 5 మాగ్నిట్యూడ్ భూకంపాలు సాధారణం.

యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ భూకంపం పట్ల అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని పరీక్షించి ఉండొచ్చని భావిస్తున్నారు. దీని తీవ్రతకు భూమి కంపించి ఉండొచ్చని చెబుతున్నారు. భూగర్భ అణు పరీక్షలు జరిగితే రిక్టర్ స్కెల్ పై 4.5 తీవ్రతకు పైగా భూకంపాలని సంభవించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు గుర్తించారు. తాజా భూకంప తీవ్రత 4.3 కే పరిమితమైందని గుర్తుచేస్తున్నారు.

ఇరాన్ 24 గంటల్లో అణు బాంబు తయారు చేయగలనని పలుమార్లు ప్రకటించారు. యూరేనియం 60 శాతం వరకు శుద్ధి చేశామని కూడా. అణు బాంబు తయారీకి 80 నుండి 90 శాతం యురేనియం శుద్ధి అవసరం. శాస్త్రీయ అణు సామర్థ్య పరీక్షలను ధృవీకరించలేదు. ఇది సహజంగానే సంభవించి ఉండొచ్చని చెబుతున్నారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular