వ్యాపారం
ఓయ్-చంద్రశేఖర్ రావు
బంగారం ధరలు సామాన్య కొనుగోలుదారులకు భారీ షాక్ ఇచ్చాయి. ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయెల్ దాడుల అనంతరం అమాంతం వీటి రేట్లు పెరిగాయి. గత వారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రామాలకు ఏకంగా 9,430 రూపాయల మేర ప్రియం కాగా, 22 క్యారెట్ల బంగారం ధరలో 8,550 రూపాయల పెరుగుదల నమోదైంది. సోమవారం నుండి వీటి రేట్లు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. వారం ముగిసేసరికి రికార్డు స్థాయికి చేరుకుంటాయనే అంచనాలు ఉన్నాయి. రూ. 1,75,000 నుండి 1,80,000 రూపాయల వరకు వెళ్లొచ్చు.
శుక్రవారం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం ఒక్కసారిగా 1,800 పెరిగి 10 గ్రామాలకు 1,64,700కి చేరింది. నేడు దేశ రాజధానిలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రామాలకు 1,68,860 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా పసిడి మెరుపు కొనసాగుతోంది. గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఔన్స్‌కు 5,172.17 డాలర్ల వద్ద స్థిరపడింది. వెండి అంతర్జాతీయ స్పాట్ ధర ఔన్స్‌కు 89.72 డాలర్లుగా నమోదైంది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను సురక్షిత పెట్టుబడుల వైపు మళ్ళించాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఉదయం వెండి ధర కిలోకు రూ.2,95,000గా ఉంది. శుక్రవారం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,500 తగ్గి రూ.2,68,000కి చేరింది. జనవరిలో వెండి ధర కిలోకు రూ.4 లక్షల మార్కును అధిగమించడం దాని అస్థిరతను స్పష్టం చేస్తుంది. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, దిగుమతి సుంకం, జీఎస్‌టీ, స్థానిక పన్నులు, నగల వ్యాపారుల మార్జిన్‌పై ఆధారపడి ఉంటాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ఫ్యూచర్ రేట్లు, గ్లోబల్ స్పాట్ ధరలు కూడా దేశీయ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయి. దీని వల్లే నగరాల మధ్య ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తాయి. నేడు ఢిల్లీ, జైపూర్, లక్నో, చండీగఢ్‌లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,68,860, 22 క్యారెట్లు రూ. 1,54,800గా నమోదయ్యాయి. ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,68,710, 22 క్యారెట్లు రూ. 1,54,630గా ఉంది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,582, 22 క్యారెట్లు – రూ. 15,200, 18 క్యారెట్లు – రూ. 13,010
ముంబై..
24 క్యారెట్లు – రూ. 16,473, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు – రూ. 12,355
బెంగళూరు..
24 క్యారెట్లు – రూ. 16,473, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు – రూ. 12,355
హైదరాబాద్..
24 క్యారెట్లు – రూ. 16,473, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు – రూ. 12,355
విజయవాడ..
24 క్యారెట్లు – రూ. 16,473, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు – రూ. 12,355
విశాఖపట్నం..
24 క్యారెట్లు – రూ. 16,473, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు – రూ. 12,355

