Tuesday, April 21, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణరక్తమోడిన కెనడియన్ హైస్కూల్- మాస్ షూటింగ్: 10 మంది దుర్మరణం | కెనడియన్ స్కూల్ తుపాకీ...

రక్తమోడిన కెనడియన్ హైస్కూల్- మాస్ షూటింగ్: 10 మంది దుర్మరణం | కెనడియన్ స్కూల్ తుపాకీ కాల్పులు టంబ్లర్ రిడ్జ్ స్కూల్‌లో పోలీసు రెస్పాన్స్ ఆపరేషన్‌లో అనేక మంది వ్యక్తులను గాయపరిచాయి

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

ఓయ్-చంద్రశేఖర్ రావు

కెనడాలోని ఓ హైస్కూల్‌లో భారీగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. 25 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక షూటర్ మృతి చెందింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

కెనడా బ్రిటిష్ కొలంబియాలోని టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్‌లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కాల్పుల రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) ధృవీకరించబడింది. ఇందులో ఎంతమంది పాల్గొన్నారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, ఒకరి కంటే ఎక్కువమంది కాల్పులకు దిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తాము జరిపిన ఎదురు కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరో యాక్టివ్ షూటర్.. హైకూల్ అవరణలో ఉన్నట్లు నిర్ధారించింది.

కెనడియన్ స్కూల్ తుపాకీ కాల్పులు టంబ్లర్ రిడ్జ్ స్కూల్‌లో పోలీసు రెస్పాన్స్ ఆపరేషన్‌లో అనేక మంది వ్యక్తులను గాయపరిచాయి

ఈ కాల్పులకు తెగబడిన వారిలో ప్రధాన అనుమానితుడు మృతి చెందినట్లు భావిస్తున్నామని కెనడియన్ పోలీసులు వెల్లడించినట్లు ఫ్యాక్స్ న్యూస్. రెండో అనుమానితుడు ఇంకా స్కూల్ ఆవరణలోనే ఉన్నాడని, బాధితుల సంఖ్య ఎంత అనే విషయాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడే మోహరించి ఉన్నారు. స్థానికంగా అత్యవసర హెచ్చరిక జారీ చేశారు.

టబ్లర్ రిడ్జ్ ప్రాంతంలో నివసించే ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని, తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు బయటికి రావొద్దని సూచించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు పొరుగు డిటాచ్‌మెంట్ల నుండి అదనపు పోలీసు బలగాలు, అలాగే నార్త్ డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంను టంబ్లర్ రిడ్జ్ కు పంపించారు. భద్రతా చర్యలను, సహాయక కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత.

ప్రావిన్షియల్ వెబ్‌సైట్ ప్రకారం టంబ్లర్ రిడ్జ్ సెకండరీ పాఠశాలలో 175 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ 7 నుండి 12వ వరకు తరగతులు ఉన్నాయి. ఎలిరీమెంట్ స్కూట్ కూడా దీనికి ఆనుకునే ఉంటుంది. కాల్పులు సెకండరీ స్కూల్ ఆవరణలో సంభవించాయి. కాల్పుల ఉదంతం సంభవించిన వెంటనే ఈ వాటిని కూడా మూసివేసినట్లు పీస్ రివర్ సౌత్ స్కూల్ డిస్ట్రిక్ట్ ప్రదర్శించింది. ఆర్‌సీఎంపీ, అంబులెన్స్ సహాయంతో సహా అదనపు బలగాలను సంఘటన స్థలానికి పంపించినట్లు పీస్ రివర్ సౌత్ ప్రతినిధి లారీ న్యూఫెల్డ్ తెలిపారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular