నీటి ఎద్దడిపై స్పందన.. సొంత ఖర్చులతో ట్యాంకర్ల ఏర్పాటు!
సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్ సేవలపై ప్రజల హర్షం
మాటల్లో కాదు.. చేతల్లో ప్రజాసేవ చూపిస్తున్న సర్పంచ్ అభ్యర్థి!
నీటి కష్టాలు తీర్చేందుకు ముందుకొచ్చిన తిరువీధి రమేష్!
సొంత ఖర్చులతో వార్డుల్లో నీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా
ప్రజల దాహార్తి తీర్చేందుకు సేవా కార్యక్రమం.. అభినందిస్తున్న పట్టణవాసులు
వెల్దుర్తి నజీర్, నవంబర్ 14 (సీమకిరణం న్యూస్):

వెల్దుర్తి పట్టణంలోని పలు వార్డుల్లో నెలకొన్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని సర్పంచ్ అభ్యర్థి, ప్రముఖ వ్యాపారవేత్త తిరువీధి రమేష్ తనవంతు సహాయాన్ని అందిస్తున్నారు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తన సొంత ఖర్చులతో నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ వారి దాహార్తిని తీరుస్తున్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన రమేష్, తక్షణ ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. వార్డుల్లోని ప్రజలకు అవసరమైన తాగునీటిని అందిస్తూ తన వంతు సహకారం అందిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న నిత్య సమస్యలపై స్పందిస్తూ నీటి సరఫరాకు ముందుకు రావడంపై పలువురు పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ వార్డులకు నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించి ఇబ్బందులు తొలగిస్తున్న తిరువీధి రమేష్‌కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం, వారి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. నీటి సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రజలకు అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

