తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
హైదరాబాద్ మహానగరంలో రోజుకూ ఆకతాయిల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. బుద్దిగా చదువుకోవాల్సిన ఏజ్ లో మతి తప్పి ప్రవర్తిస్తున్నారు. గల్లీల్లో న్యూసెన్స్ క్రియేట్ చేయడం.. మహిళలు, యువతులకు ఇష్టం వచ్చినట్లు పబ్లిక్ లో తాకుతూ వెళ్లడం.. ఇష్టానుసారం రోడ్లపై బైక్ ల మీద అరుస్తూ ఇతరులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నారు. భావి తరాలకు ఆదర్శంగా ఉండాల్సిన యువత ఇలా బాధ్యత మరచి ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన ఓ నిదర్శనం అని చెప్పొచ్చు.
హైదరాబాద్‌లోని కుషాయిగూడలో దారుణం జరిగింది. పోకిరీల ఆగడాలకు ఓ నిండు ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. ఆ యువకులు మనుషులుగా కాకుండా రాక్షసుల మాదిరి ప్రవర్తించారు. ఓ వ్యక్తిని కారుతో గుద్ది.. కిలో మీటరు వరకు ఈడ్చుకెళ్లారు. కారు కు సైరన్ వేసుకుంటూ వెళ్తూ.. నడిరోడ్డుపై హంగామా సృష్టించారు. పోకిరీలు సైరన్ వేసుకుంటూ.. పై ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఏం జరిగిందంటే..?
ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రైవేట్ ఉద్యోగి సతీష్ కారు.. కొందరు పోకిరీలు బొలెరో కారుతో గుడ్డి ఆపకుండా వెళ్లిపోయారు. అయితే కొద్ది దూరం వరకు వెంబడించి.. యువకుల కారును సతీష్ ఆపాడు. బొలెరో కారుకి ఎదురుగా నిల్చుని మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా.. సతీష్ ను కారుతో ఢీ కొట్టారు ఆ యువకులు. దాంతో సతీష్ కింద పడిపోయాడు. అలా కారు బంపర్ ను పట్టుకున్నాడు. అయితే కారు కింద సతీష్ ఉన్నాడని తెలిసి ఆ యువకులు అలాగే కారు నడుపుకుంటూ 700 మీటర్ల వరకు వెళ్లారు.
అయితే ఈ ఘటనలో సతీష్ వీపు అంతా చెక్కుకు పోవడంతో బంపర్ ను వదిలేశాడు. దాంతో సతీష్ పై నుంచి కారు వెళ్లింది. ఈ ప్రమాదంలో సతీష్ ప్రైవేట్ పార్ట్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. కాలు విరిగిపోయింది. ప్రస్తుతం సతీష్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అయితే కారుకి సైరన్ ఎందుకుంది..? కారులో ఉన్న యువకులు ఎవరు..? మద్యం, గంజాయి మత్తులో ఉన్నారా..? అనే విషయంపై పోలీసులు ఎలాంటి వివరాలు చెప్పడం లేదని సతీష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

