ఆంజనేయ స్వామి మాలాధారణ స్వాములకు అన్నదాన సేవ!

అన్నదాన కార్యక్రమానికి పారిశ్రామికవేత్త తిరువీధి రమేష్ శెట్టి సహకారం   స్వాములకు స్వయంగా భోజనం వడ్డించిన పారిశ్రామికవేత్తలు   వెల్దుర్తి నజీర్, నవంబర్ 14 (సీమకిరణం న్యూస్): ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అన్నదాన సేవలకు తమవంతు సహకారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. వెల్దుర్తి పట్టణంలోని పసులోని దేవాలయంలో ఆంజనేయ స్వామి మాలాధారణ చేపట్టిన స్వాములకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి వెల్దుర్తికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తిరువీధి రమేష్ శెట్టి తనవంతు సహకారం అందించారు. శనివారం దేవాలయానికి చేరుకున్న తిరువీధి రమేష్ శెట్టికి ఆంజనేయ స్వామి...