పాత రుసుముల ప్రకారమే ట్రేడ్ లైసెన్స్ కట్టండి
రాష్ట్ర మంత్రి టీజీ భరత్
వ్యాపారస్తులకు ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రి
కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 19, (సీమకిరణం న్యూస్):
కర్నూలు నగరంలోని వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్స్ ఫీజులను పాత రుసుముల ప్రకారమే కట్టాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెంచిన ట్రేడ్ లైసెన్స్ ఫీజును ఇప్పుడే అమలు చేయవద్దని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు మంత్రి టీజీ భరత్ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాదిలో పాలకవర్గం నగరంలోని ట్రేడ్ లైసెన్స్ రుసుములను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడే అమలు చేయవద్దని మంత్రి సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, బలవంతంగా వసూలు చేయోద్దని స్పష్టం చేశారు. వ్యాపారస్తులపై అదనపు భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. వ్యాపారస్తులు పాత ఫీజుల ప్రకారమే ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలన్నారు.

