Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణరేపు సెలవు ప్రకటించిన సర్కార్, వీరికే వర్తింపు..!! | తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల...

రేపు సెలవు ప్రకటించిన సర్కార్, వీరికే వర్తింపు..!! | తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున సెలవులకు ఉత్తర్వులు జారీ చేసింది, వివరాలు ఇక్కడ ఉన్నాయి

📰 Generate e-Paper Clip


తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్దం అవుతోంది. ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. హోరా హోరీగా ప్రచారం నిర్వహించారు. పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు శక్తి మేర అభ్యర్ధించారు. అటు రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదే సమయంలో పోలింగ్ వేళ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే, సెలవు వర్తింపు విధానాలపై ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది.

తెలంగాణ మున్సిపల్ పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసారు. రాజకీయ నేతల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. పోలింగ్ వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపాటి (బుధవారం) పోలింగ్ రోజును సెలవుగా ప్రకటించిన సర్కార్. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఫ్యాక్టరీలు, షాపులు, పరిశ్రమలకు సెలవులు రానున్నాయి. అదనంగా, మున్సిపాలిటీల పరిధిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఈ సెలవులు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మాత్రమే ఈ సెలవు వర్తించనుంది.

మునిసిపల్-ఎన్నికలకు-తెలంగాణ-ప్రభుత్వం-సెలవు-ఆజ్ఞలు-రాష్ట్రవ్యాప్తంగా-పోలింగ్-రోజు-వివరాలు

పోలింగ్ కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు

కాగా, హైదరాబాద్ లో పని చేస్తున్న ఓటింగ్ జరుగుతున్న ప్రాంతాల ఉద్యోగులకు ప్రత్యేకంగా సెలవు ఇస్తున్నారు. దీంతో, ఓటు వేసేందుకు సొంత ప్రాంతాలకు బయల్దేరుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగనుంది. మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,301 బాలెట్ బాక్సులను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. రేపు (ఫిబ్రవరి 11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ సమయంలో మద్యం షాపులు మూసేయడంతో పాటు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోనున్నారు. స్థానిక ఎన్నికలు కావటంతో భారీగా పోలింగ్ జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular