పరమేష్‌ను పరామర్శించిన తిరువీధి కుటుంబీకులు
పరమేష్ కుటుంబానికి అండగా ఉంటాం.. తిరువీధి కుటుంబీకుల భరోసా!
వెల్దుర్తి నజీర్, నవంబర్ 14 (సీమకిరణం న్యూస్):
వెల్దుర్తి పట్టణంలోని 1వ వార్డులో నివాసం ఉంటున్న ఐరన్ ఓర్ వ్యాపారవేత్త పరమేష్ అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న పారిశ్రామికవేత్తలు తిరువీధి కుటుంబీకులు శనివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా పరమేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్, డాక్టర్ టి. రాంప్రసాద్, పారిశ్రామికవేత్తలు టి. వంశీధర్, టి. సుధీంద్ర, ఏ. కిరణ్, టి. శివయ్య తదితరులు పాల్గొన్నారు.

