Tuesday, September 29, 2026
ads
📄 ePaper
Homeఆరోగ్యంప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలకు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆహ్వానం

ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలకు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆహ్వానం

📰 Generate e-Paper Clip

ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలకు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆహ్వానం

 

కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 29, (సీమకిరణం న్యూస్) :

 

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు కర్నూలు హెల్త్ క్లబ్, ఏ-క్యాంప్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నానికి చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డా. ఐఏవీ ప్రసాద్ లాల్, MD, DM ముఖ్య అతిథిగా హాజరై “హృద్రోగాల నివారణలో జీవనశైలి మార్పులు” అనే అంశంపై కీలక ప్రసంగం చేయనున్నారు. ఆయనకు “Outstanding Person of the Year Award” అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు టీ.జీ. వెంకటేష్ దీపప్రజ్వలన చేయనుండగా, ఏపీ ప్రభుత్వ మెడికల్ అండ్ హెల్త్ హైపవర్ కమిటీ చైర్మన్ జస్టిస్ యు. దుర్గా ప్రసాద్ రావు పాల్గొననున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ మరియు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షురాలు డా. ఏ. సిరి,  ప్రపంచ హృదయ దినోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించనున్నారు. డా. జి. భవానీ ప్రసాద్, డా. గెల్వి సహదేవుడు, కె.సి. కల్కురా, డా. ఏ. వసంత కుమార్ తదితరులు గౌరవ అతిథులుగా పాల్గొంటారు. హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డా. పి. చంద్రశేఖర్తో పాటు ఈసీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం 2026లో “Don’t Miss a Beat” ప్రచారంతో హృదయ సంబంధ వ్యాధుల లక్షణాలను గుర్తించడం, నివారణ చర్యలు చేపట్టడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular