Monday, September 28, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వార్తలు అవాస్తవం.. 

డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వార్తలు అవాస్తవం.. 

📰 Generate e-Paper Clip

డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వార్తలు అవాస్తవం.. 

 

సోషల్ మీడియా వదంతులు నమ్మొద్దు 

 

ఫోన్ నంబర్ లింక్ చేయకున్నా లైసెన్స్ రద్దు కాదు

 

 

కర్నూలు జిల్లా రవాణా శాఖ అధికారి ఎల్. భరత్ చవాన్

 

 

 

కర్నూలు ప్రతినిధి , సెప్టెంబర్ 25, (సీమకిరణం న్యూస్):

 

 

డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్ రద్దవుతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కర్నూలు జిల్లా రవాణా శాఖ అధికారి (ఆర్టీవో) ఎల్. భరత్ చవాన్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆర్టీవో అధికారిక ఇన్‌స్టాగ్రామ్ (rto_kurnool) ఖాతా ద్వారా ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా సెప్టెంబర్ 25వ తేదీ లోపు డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోకపోతే లైసెన్స్ సస్పెండ్ అవుతుందంటూ వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వదంతులను చూసి ఆందోళన చెందిన వాహనదారులు ఆర్టీవో కార్యాలయానికి క్యూ కడుతున్నారు. దీనిపై స్పందించిన ఆర్టీవో.. రవాణా శాఖ నుంచి అలాంటి ఆదేశాలు ఏమీ రాలేదని, ఆ వార్తలను అసలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

 

ఆర్టీవో ఆఫీస్‌కు రానవసరం లేదు.. ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు!

 

కేవలం మొబైల్ నంబర్ అప్‌డేట్ కోసం ఎవరూ ఆర్టీవో ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పనిలేదని, ఆన్‌లైన్ ద్వారా తమ మొబైల్ నుంచే సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చని ఆయన వివరించారు. కేంద్ర రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్ parivahan.gov.in లోని ‘సారథి’ (Sarathi) పోర్టల్‌లోకి వెళ్లి, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పుట్టిన తేదీ (Date of Birth) నమోదు చేయడం ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలో ఫోన్ నంబర్ అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపారు. ఒకవేళ సర్వర్ బిజీగా ఉంటే మరుసటి రోజు ప్రయత్నించాలని సూచించారు.

 

ఫోన్ నంబర్ లింక్ వల్ల ప్రయోజనాలు ఇవే..

 

లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్ చేయడం వల్ల భవిష్యత్తులో ఆన్‌లైన్ సేవలు పొందడం చాలా సులభం అవుతుందని ఆర్టీవో భరత్ చవాన్ తెలిపారు. అడ్రస్ మార్పు (Change of Address), లైసెన్స్ రెన్యూవల్, కొత్త వాహన తరగతిని జత చేసుకోవడం వంటి సేవలను నేరుగా ఆన్‌లైన్ ద్వారానే వేగంగా పొందవచ్చని ఆయన వివరించారు. ప్రజలు అనవసర వదంతులు నమ్మి దళారుల చేతిలో మోసపోవద్దని వాహనదారులకు ఆయన సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular