ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి
కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు
కర్నూలు, జూలై 10 (సీమకిరణం న్యూస్):

కల్లూరు మండల పరిధిలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు గురువారం పరిశీలించారు. మండల పరిధిలోని 192, 193, 199, 200, 201 పోలింగ్ స్టేషన్లతో పాటు సుంకులమ్మ కట్ట ప్రాంతంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. బూత్ స్థాయి అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఓటర్ల వివరాల పరిశీలన, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు కావాలని, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, బూత్ స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

