Saturday, June 13, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వెల్దుర్తి 14వ వార్డులో విద్యుత్ శాఖ జనబాట కార్యక్రమం

వెల్దుర్తి 14వ వార్డులో విద్యుత్ శాఖ జనబాట కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం : ఏఈ ఆర్. రఘునాథం

 

వెల్దుర్తి, జూన్ 12, (సీమకిరణం న్యూస్):

వెల్దుర్తి మండల కేంద్రంలోని 14వ వార్డు పరిధిలో శుక్రవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈ ఆర్. రఘునాథం మాట్లాడుతూ, విద్యుత్ సరఫరా, లైన్ లోపాలు, మీటర్లకు సంబంధించిన ఇబ్బందులు లేదా ఇతర విద్యుత్ సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే శాఖ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సేవలు అందించడమే శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది ప్రజల సమస్యలను నమోదు చేసి, అవసరమైన సూచనలు అందించారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారులకు వివరించగా, అధికారులు వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular