వెల్దుర్తి 14వ వార్డులో విద్యుత్ శాఖ జనబాట కార్యక్రమం
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం : ఏఈ ఆర్. రఘునాథం వెల్దుర్తి, జూన్ 12, (సీమకిరణం న్యూస్): వెల్దుర్తి మండల కేంద్రంలోని 14వ వార్డు పరిధిలో శుక్రవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈ ఆర్. రఘునాథం మాట్లాడుతూ, విద్యుత్ సరఫరా, లైన్ లోపాలు, మీటర్లకు సంబంధించిన ఇబ్బందులు లేదా ఇతర విద్యుత్ సమస్యలు ఏవైనా...