Thursday, March 12, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అతనే..! ట్రంప్ కు షాక్..! | ఇరాన్ అసెంబ్లీ ఇప్పుడు...

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అతనే..! ట్రంప్ కు షాక్..! | ఇరాన్ అసెంబ్లీ ఇప్పుడు కొత్త సుప్రీం నాయకుడిని ఎన్నుకుంది – తుది చర్చల తర్వాత గుర్తింపు వెల్లడి అవుతుంది

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ అసెంబ్లీ కొత్త సుప్రీం లీడర్ ను ఎన్నుకుంది. ప్రస్తుత పరిస్థితులకు తగిన నేతను ఎన్నుకున్నట్లు ఇరాన్ నేతలు తెలియజేసారు. కానీ కొత్త సుప్రీం లీడర్ ఎవరు ప్రకటించేందుకు కాస్త సమయం పడుతుందని ఉంది. ఇరాన్ అసెంబ్లీలోని మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు సుప్రీం నేతను ఎన్నుకున్నట్లు సమాచారం.

ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా గతవారం సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమైన విషయం తెలిసిందే. ఖమేనీతో పాటు అతని కుటుంబ సభ్యులు, అలాగే దాదాపు 40 మంది ఇరాన్ నేతలు హతం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులను ముమ్మరం చేసింది. అలాగే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులను చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ను ఎన్నుకుంది.

ఇక ఇరాన్ లోని అసెంబ్లీలో మొత్తం 88 మంది సభ్యులు ఉంటారు. ఇరాన్ లోని మత పెద్దల ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశం అయినట్లు సమాచారం. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అందరూ ఒకే చోట సమావేశం కావడం వీలు పడదని. ఇదే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానికి ముందు .. తన తర్వాత ఎన్నుకునే నేత ఇరాన్ శత్రు దేశాలు తీవ్రంగా ద్వేషించే వ్యక్తి అయి ఉండాలని సూచించినట్లు ఖమేనీ సన్నిహితుడు మోసేన్ హైదరీ ప్రకటించారు.

ఇక ఇరాన్ సుప్రీం లీడర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే భద్రతా కారణాల వల్లే ఇరాన్ తాజా సుప్రీం లీడర్ పేరును ప్రకటించలేదని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేయడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.

ఇరాన్ అసెంబ్లీ కొత్త సుప్రీం నాయకుడిని ఎన్నుకుంది, తుది చర్చల తర్వాత గుర్తింపును బహిర్గతం చేయాలి

గల్ఫ్ దేశాలపై దాడులు చేయడంపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. దాంతో పెజెష్కియాన్ వ్యాఖ్యలపై ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై దాడులను ఉద్ధృతం చేశారు. ఇరాన్ లొంగిపోయేంత వరకూ యుద్ధం కొనసాగుతుందని తెలుసు. ఇదిలాఉంటే అమెరికాకు లొంగి పోయే ప్రసక్తే లేదని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఇప్పుడు సద్దుమణిగేలా కనిపించడం లేదు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular