ఆంధ్ర ప్రదేశ్
ఓయి-లింగారెడ్డి గజ్జల
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో సంభవించిన ఘోర బాణసంచా పేలుడు ఘటన యావత్ రాష్ట్రాన్ని కన్నీటిపర్యంతం చేస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాల ఆశలు, ఆ గాలిలోనే కలిసిపోయాయి. కళ్లముందే కన్నవారు, కట్టుకున్నవారు అగ్నికీలల్లో ఆహుతైపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ గ్రామం విలవిలలాడుతోంది.
సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం మధ్యాహ్నం వరకు అంతా మామూలుగానే ఉంది. కానీ, ఒక్కసారిగా సంభవించిన బాణసంచ పేలుడు ఆ ప్రాంతాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చేసింది. పేలుడు ధాటికి గ్రామమంతా వణికిపోయింది, ఇళ్లు అద్దాలు పగిలిపోయాయి. దట్టమైన పొగలు, మంటల మధ్య కార్మికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు మృతుల సంఖ్య 23కి చేరింది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరికొందరు ప్రాణాలు వదలడం పరిస్థితి తీవ్రతను పరిశీలిస్తోంది. ఇంకా నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

బురద పొలాలు.. అడ్డుపడ్డ అంబులెన్సులు..
ఈ ప్రమాదంలో ప్రకృతి కూడా బాధితులను వెక్కిరించింది. బాణసంచ తయారీ కేంద్రం జనవాసాలకు దూరంగా, వరి పొలాల మధ్య ఉండటంతో.. ప్రమాదం జరిగిన వెంటనే ఫైరింజన్లు, అంబులెన్సులు అక్కడికి చేరుకోలేకపోయాయి. పొలాలు బురదమయంగా ఉండటంతో వాహనాలు ఇరుక్కుపోయాయి. దాదాపు రెండు గంటల పాటు బాణసంచా పేలుళ్లు కొనసాగుతూనే ఉండటంతో, ప్రాణాలు కాపాడేందుకు స్థానికులు కూడా వెళ్లలేకపోయారు. చివరకు వెళ్లేసరికి.. అక్కడ శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్న భీతావహ దృశ్యం ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేసింది.
అగ్నిమాపక మరియు రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి, పలువురు లోపల చిక్కుకుపోయి ఉండవచ్చు.
ముఖ్యమంత్రి #చంద్రబాబు నాయుడు ఫోన్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తుంది, రెస్క్యూ మరియు వైద్య చర్యలను సులభతరం చేయడానికి అధికారులను ఆదేశించింది.#వెట్లపాలెం #సామర్లకోట #కాకినాడ #పేలుడు #ఆంధ్రప్రదేశ్ pic.twitter.com/3N1vpHkvxs
– సూర్య రెడ్డి (@jsuryareddy) ఫిబ్రవరి 28, 2026
లక్ష్యం ఒక్కటే.. బలి ఒక్కటే!
నివేదికల ప్రకారం, ఆరు షెడ్లలో బాణసంచ తయారీ. ఈ పరిశ్రమకు లైసెన్స్, రక్షణ చర్యలు మాత్రం శూన్యమని స్థానికులు మండిపడుతున్నారు. పేలుడు సంభవించిన వెంటనే యజమాని పరారీలో ఉన్నట్లు ఆర్డీవో మల్లిబాబు తెలిపారు. కొంతమంది కార్మికులు భోజనం కోసం బయటకు వెళ్లడం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. లేదా మృతుల సంఖ్య మరింత భయంకరంగా ఉండేదని.
బాధితుల్లో ఎవరున్నారు?
ప్రస్తుతం కాకినాడజీహెచ్‌లో చావుబతుకుల మధ్య పోరాడుతున్న వారిలో వేట్లపాలెం వాసి కప్ప వెంకట లక్ష్మి, పెద్దాపురం వాసి మోర్త శ్రీను, సామర్లకోటకు చెందిన కె. శ్రీను, చిటికెల లక్ష్మి ఉన్నారు. వీరి కుటుంబ సభ్యుల రోదనలు ఆసుపత్రి ప్రాంగణంలో గుండెలను పిండేస్తున్నాయి.
నేరుగా రంగంలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు..
విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే తన పర్యటన ముగించుకుని కాకినాడకు బయలుదేరారు. ఆయన స్వయంగా ఘటనను పరిశీలించి, అనంతరం ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఇప్పటికే అధికారులను నిలదీశారు.
అమ్మేవాడికి లాభం.. తయారు చేసేవాడికి శాపం అన్నట్టుగా మారింది బాణసంచ తయారీ. సంక్రాంతి, పెళ్లిళ్ల సీజన్ కోసం టపాసులు తయారు చేస్తూ.. తమ జీవితంలో టపాసుల్లా పేల్చుకుంటున్న ఈ నిరుపేదల బతుకులకు భరోసా ఎప్పుడు లభిస్తుందో? నిబంధనల ఉల్లంఘనతో ఇంకా ఎన్ని నిండు ప్రాణాలు గాలిలో కలవాలి?

