Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణసర్వం శివోహం.. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చెప్పింది! | శివోహం..మహా శివరాత్రి సందర్భంగా...

సర్వం శివోహం.. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చెప్పింది! | శివోహం..మహా శివరాత్రి సందర్భంగా సీఎంలు రేవంత్, చంద్రబాబు చెప్పిన మాట ఇది!

📰 Generate e-Paper Clip


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం నాలుగు గంటల నుండి ఆలయాలకు పోటెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో వేయి స్తంభాల దేవాలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు క్యూ కట్టారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోనూ ఈరోజు తెల్లవారుజాము నుంచే అభిషేకాలు చేస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు.ఆలయాలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారీ ఏర్పాట్లు చేశారు. అనేక ఆలయాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

తెలంగాణా, ఏపీలో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాదగిరిగుట్ట ఝరాసంగం,కీసర, కాళేశ్వరం వంటి ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలం మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. శ్రీకాళహస్తి లోను భక్తజనం స్వామివారిని దర్శించుకోవడానికి పోటెత్తారు. అమరావతి అమరలింగేశ్వర స్వామితో పంచారామ క్షేత్రాలన్నీ సర్వం శివోహం అన్నట్టుగా దర్శనమిస్తున్నాయి. శ్రీశైలం, మహానంది పంచరామ క్షేత్రాల్లో ప్రత్యేక చర్యలు.

shivoham మహా శివరాత్రి సందర్భంగా సీఎంలు రేవంత్, చంద్రబాబు చెప్పిన మాటలు

మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పిన సీఎం రేవంత్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలకు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శివుడిని ప్రార్థించారు. శివరాత్రి ఉపవాస పూజలను భక్తులందరికీ ఆ పరమశివుడి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

మహా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రం కొలువైన పవిత్ర భూమి మన రాష్ట్రంలోనే ఉందని చంద్రబాబు ఎప్పుడైనా శివుడు ఈరోజే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోంది. ఈ పర్వదినాన శివారాధన తో మహాశివుని అనుగ్రహం కలిగి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. శివార్చన, జాగరణలతో భక్తిశ్రద్ధలతో జరుపుకుందామని ఆయన రాష్ట్ర ప్రజలకు ఉన్నారు. పరమశివుని అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా చంద్రబాబు పోస్ట్ పెట్టారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular