చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ, ఆగస్టు 03, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేప, రొయ్య పిల్లల కొనుగోలు కోసం రూ.116 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక టెండర్ల అనంతరం చెరువుల్లో వాటిని విడుదల చేయనుంది. రాష్ట్రంలోని 26 వేల చెరువుల్లో పెంచేందుకు 88 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం గతంలోనే చెప్పింది. దీంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

