Wednesday, April 22, 2026
ads
📄 ePaper
HomeతెలంగాణViral Video: అడవిలో అరుదైన చిరుతల సందడి! | వైరల్ వీడియో: కర్ణాటకలోని భద్ర రిజర్వ్‌లో...

Viral Video: అడవిలో అరుదైన చిరుతల సందడి! | వైరల్ వీడియో: కర్ణాటకలోని భద్ర రిజర్వ్‌లో అరుదైన బ్లాక్ పాంథర్ మరియు చిరుతపులి కలిసి నీరు తాగుతోంది

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయి-లింగారెడ్డి గజ్జల

కర్ణాటకలోని పచ్చని అడవుల్లో ప్రకృతి తన అద్భుతాన్ని ఆవిష్కరించింది. దట్టమైన పొదలు, తీక్షణమైన చూపుల మధ్య వన్యప్రాణి ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తే ఒక అరుదైన దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. భద్ర పులుల అభయారణ్యంలో (భద్ర టైగర్ రిజర్వ్) ప్రముఖ ఫోటోగ్రాఫర్ సోహన్ సింగ్ క్లిక్ మనిపించిన ఒక ఫోటో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. వన్యప్రాణి చరిత్రలో ఒకే ఫ్రేమ్‌లో సాధారణ మచ్చల చిరుత, అరుదైన నల్ల చిరుత (బ్లాక్ పాంథర్) పక్కపక్కనే కనిపించడం అత్యంత అరుదైన విషయం.

ఈ అద్భుత దృశ్యం శుక్రవారం సోషల్ మీడియాలోకి రాగానే నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. అడవిలోని ఒక నీటి కుంట వద్ద ఈ రెండు చిరుతలు ఎంతో ప్రశాంతంగా దాహాన్ని తీర్చుకుంటున్న వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. సాధారణంగా నల్ల చిరుతలు చాలా సిగ్గుపడే స్వభావం కలిగి ఉంటుంది, అడవిలో ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడుతుంటాయి. అలాంటిది ఏమాత్రం బెరుకు లేకుండా మరో చిరుతతో కలిసి కనిపించడం విశేషం. ఈ రెండు చిరుతలు ఒకే తల్లికి తోబుట్టువులు అయి ఉండవచ్చని వన్యప్రాణి నిపుణులు అంచనా వేస్తున్నారు.

కర్నాటకలోని భద్రా రిజర్వ్‌లో అరుదైన నల్ల చిరుతపులి మరియు చిరుతపులి కలిసి నీరు తాగుతున్న వైరల్ వీడియో

వైజ్ఞానిక పరంగా చూస్తే, ఈ నల్ల చిరుత వేరే జాతి జంతువు ఏమీ కాదు. దీనిని ‘మెలనిస్టిక్ లెపార్డ్’ (మెలనిస్టిక్ లెపార్డ్) అని పిలుస్తారు. జన్యుపరమైన మార్పుల వల్ల చర్మంలో నలుపు రంగును ఇచ్చే ‘మెలనిన్’ అనే పిగ్మెంట్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఇలాంటి రంగు వస్తుంది. మనం చీకటిలో టార్చ్ వేసి చూస్తే ఈ నల్లని చర్మంపై కూడా సాధారణ చిరుతకు ఉండే మచ్చలు స్పష్టంగా కనిపిస్తాయి. దట్టమైన నీడలు ఉండే పశ్చిమ కనుమల అడవుల్లో ఇలాంటి చిరుతలు వాటి రంగును వేటాడటానికి రక్షణ కవచంగా వాడుకుంటాయి.

గతంలో కర్ణాటకలోని కబిని అడవుల్లో ‘సాయా’ అనే నల్ల చిరుత ప్రపంచ ప్రసిద్ధి చెందింది, ఇప్పుడు భద్ర రిజర్వ్‌లో ఈ కొత్త జంట వెలుగులోకి రావడం విశేషం. ఈ ఫోటోను బంధించిన సోహన్ సింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. “ఇలాంటి దృశ్యం చూడటానికి వెయ్యి కళ్లు చాలవు.. ఫోటోగ్రాఫర్ అదృష్టం మామూలుగా లేదు” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా, ప్రకృతి మాత తన ఒడిలో ఎన్ని రహస్యాలను, అద్భుతాలను దాచుకుందో చెప్పడానికి ఈ ఫోటో నిదర్శనంగా నిలిచింది.





Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular