Monday, March 2, 2026
ads
📄 ePaper
HomeతెలంగాణNetflix షాకింగ్ నిర్ణయం: ట్రంప్ సన్నిహితుల చేతికి వార్నర్ సామ్రాజ్యం | నెట్‌ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్...

Netflix షాకింగ్ నిర్ణయం: ట్రంప్ సన్నిహితుల చేతికి వార్నర్ సామ్రాజ్యం | నెట్‌ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ డీల్ నుండి వైదొలిగింది: పారామౌంట్ స్కైడాన్స్ హై-స్టేక్స్ కార్పోరేట్ యుద్ధంలో మార్గాన్ని క్లియర్ చేస్తుంది

📰 Generate e-Paper Clip


వ్యాపారం

ఓయి-లింగారెడ్డి గజ్జల

నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్, పారామౌంట్.. ఈ పేర్లు వింటేనే భారీ హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు గుర్తొస్తాయి. కానీ, గత కొన్ని రోజులుగా ఈ దిగ్గజ సంస్థల మధ్య సాగుతున్న డ్రామా ఏదో హై-వోల్టేజ్ యాక్షన్ సినిమా తలపిస్తోంది. ‘హాస్టైల్ బిడ్’ అనే ట్విస్ట్‌లు, రాజకీయ సమీకరణలు, బిలియన్ అమెరికన్ బేరసారాలతో సాగిన ఈ సదస్సులో చివరకు నెట్‌ఫ్లిక్స్ వెనక్కి తగ్గింది.. ట్రంప్ సన్నిహితులకు లైన్ క్లియర్ అయింది. అసలు స్టోరీ ఏంటంటే..

వార్నర్‌ బ్రదర్స్ డిస్కవరీ (WBD) అనే భారీ సామ్రాజ్యాన్ని సొంతం చేసుకుంది నెట్‌ఫ్లిక్స్, కామ్‌కాస్ట్, పారామౌంట్ వంటి దిగ్గజాలు రంగంలోకి దిగాయి. మొదట నెట్‌ఫ్లిక్స్‌తో వార్నర్ సంస్థకు ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరింది. దాదాపు డీల్ ఓకే అయిపోయింది అనుకుంటున్న తరుణంలో అసలు కథ మొదలైంది. నెట్‌ఫ్లిక్స్ ఒక్కో షేరుకు 28 డాలర్లు ఆఫర్ చేయగా, అంతకంటే మెరుగైన ఆఫర్ ఇస్తామంటూ పారామౌంట్‌ స్కైడ్యాన్స్‌ తెరపైకి వచ్చింది.

నెట్‌ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ డీల్ నుండి వైదొలిగింది పారామౌంట్ స్కైడాన్స్ హై-స్టాక్స్ కార్పోరేట్ యుద్ధంలో మార్గాన్ని క్లియర్ చేస్తుంది

డీల్ లో వేలు పెట్టిన ట్రంప్..

నెట్‌ఫ్లిక్స్‌తో డీల్ జరుగుతుండగానే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని పరిశీలించాల్సి ఉందంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా ఇదే సమయంలో పారామౌంట్ సంస్థ ‘హాస్టైల్ బిడ్’ (యాజమాన్యానికి ఇష్టం లేకపోయినా నేరుగా వాటాదారులను ఆకర్షించడం) వేసింది. నెట్‌ఫ్లిక్స్ కంటే 2 డాలర్లు అదనంగా, అంటే ఒక్కో షేరుకు 30 డాలర్లు ఆఫర్ చేయడంతో వార్నర్ బ్రదర్స్ మనసు మార్చుకుంది.

చర్చలు జరుపుతుండగానే ట్విస్ట్..

ఈ చిక్కుముడిని విప్పేందుకు నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ స్వయంగా వైట్‌హౌస్‌కు వెళ్లారు. అయితే ఆయన అక్కడ చర్చలు జరుపుతున్న సమయంలోనే వార్నర్ బ్రదర్స్ నుంచి అనూహ్య ప్రకటన వచ్చింది. పారామౌంట్ ఆఫర్ తమకు ఎంతో లాభదాయకంగా ఉందని, దాన్నే ఖరారు చేస్తున్నామని వారు ప్రకటించారు. దీంతో పోరాటం అని భావించిన నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం అధికారికంగా ఈ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

మార్కెట్‌లో గుత్తాధిపత్యం ..

ఈ డీల్ ఓకే అవ్వడంతో ఇప్పుడు హాలీవుడ్ రూపమే మారిపోనుంది. ట్రంప్ సన్నిహితుడు, ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ కుటుంబం (పారామౌంట్ స్కైడ్యాన్స్) నియంత్రణలోకి సీఎన్‌ఎన్‌, హెచ్‌బీఓ, కేబుల్ బిజినెస్ వంటివన్నీ వెళ్తున్నాయి. ఫలితంగా హెచ్‌బీఓ మ్యాక్స్‌, పారామౌంట్ ప్లస్ వంటి స్ట్రీమింగ్ యాప్‌లు.. సీఎన్‌ఎన్‌, సీబీఐ వంటి వార్తా సంస్థలు ఒకే గొడుగు కిందికి వస్తాయి. అయితే, ఇంత పెద్ద విలీనం వల్ల మార్కెట్‌లో గుత్తాధిపత్యం పెరుగుతుందన్న నెపంతో ‘యాంటీ ట్రస్ట్’ నిబంధనల ప్రకారం ప్రభుత్వ విచారణలకు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular