తెలంగాణ
ఓయ్-కన్నయ్య
కవిత:తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అగ్రనాయకత్వం కొంత మౌనంగా ఉన్న తరుణంలో,మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయంగా దూసుకుపోతున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ క్లీన్ చిట్ లభించిన తర్వాత, ఆమె గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తున్నారు.తాజా పరిణామాలు చూస్తుంటే కేటీఆర్,హరీష్ రావు వంటి నేతల కవితకే ప్రజల నుండి అధిక మద్దతు లభిస్తోందని కోర్టు నుండి రాజకీయ విశ్లేషకులు.
ఖమ్మం పోరాటం.. కవిత దూకుడు
ఖమ్మం శివారులలోని వెలుగుమట్ల ప్రాంతంలో సుమారు 600 ఇళ్ల కూల్చివేత ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ బాధితులకు అండగా నిలిచేందుకు కవిత నేరుగా క్షేత్రస్థాయిలోకి దిగి నిరసన. ఫిబ్రవరి 24న జరిగిన ఈ కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఈ ఒక్క పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చ మొదలైంది.పోలీసులు అడ్డుకున్నా, లాఠీలు చూపి బెదిరించినా వెనక్కి తగ్గకుండా బాధితుల పక్షాన నిలబడటం కవితలోని అసలైన పోరాట యోధురాలిని బయటకు తీసింది.అక్కడ ఆమె అరెస్ట్ అయిన తీరు,కార్యకర్తల్లో ఒక కొత్త ఊపును తెచ్చుకుంది.ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆమె చేసిన ఈ దూకుడు వైఖరి అందరినీ ఆకర్షించింది.

పోలీసుల నిర్బంధం.. కొనసాగుతున్న దీక్ష
మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కవితను దీక్షా స్థలి నుంచి అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శాంతిభద్రతల సమస్య సాకుతో ఆమెను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. అయితే, పోలీసులు ఎంతగా అడ్డుకున్నా తన పట్టు వీడలేదు. బాధిత కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుందని కవిత తేల్చిచెప్పారు. అక్కడే దీక్షను కొనసాగిస్తూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
నిబంధనల ఉల్లంఘనపై ఆగ్రహం
పోలీసుల తీరుపై తెలంగాణ జాగృతి నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కవితతో పాటు మహిళా నాయకులను అదుపులోకి తీసుకునే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది చట్ట నిబంధనలను ఉల్లంఘించడమేనని వారు వాదిస్తున్నారు. పోలీసుల తోపులాటలో పలువురు కార్యకర్తలు గాయపడటం, మరికొందరు స్పృహ తప్పి పడిపోవడంపై కవిత చేశారు. బాధితులకు అదే ప్రాంతంలో పట్టాలు మరియు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించే వరకు తమ పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నాయకత్వానికి సవాల్‌గా మారిన కవిత చరిష్మా
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం కొంత లో-ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుండగా, కవిత మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె నేరుగా చేస్తున్న విమర్శలు, ముఖ్యంగా మహిళా ఓటర్లను ప్రభావితం చేసేలా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బాధితులకు చేసిన అన్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల శాపనార్థాలను ఎదుర్కోక తప్పదని ఆమె హెచ్చరిక. కవిత ప్రస్తుత దూకుడు చూస్తుంటే, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ రాజకీయాలకు ఆమె ప్రధాన ఆకర్షణగా మారే అవకాశం కనిపిస్తోంది.
కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి కవిత కొరకరాని కొయ్యలా మారారు. త్వరలోనే కొత్త పార్టీని పెట్టబోతున్నట్లు తిరుమల వెంకన్న సాక్షిగా ఆమె చెప్పుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో పాటు కార్యకర్తల్లోను ఆందోళన. ఇప్పటికే బీఆర్ఎస్‌లోని కొందరు ముఖ్య నేతలపై కవిత తుపాకీ ఎక్కుపెట్టారు. వారిపై విమర్శలు సంధిస్తూ వారికి నిద్ర లేకుండా చేస్తున్నారు. రోజు ఈ ఉదాహరణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం తన అన్న కేటీఆర్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. మహిళలు కేవలం ఒక తల్లిగానో, సోదరిగానో, కూతురు పాత్రల్లో మాత్రమే చూడకూడదని,వ్యక్తిగతంగా సమాన హక్కులు ఉండేలా గౌరవించాలని అన్నారు. పురుషులు మహిళలు సమాజంలో సమాన హక్కులు ఉండాలని ఉండాలని..మహిళా సాధికారతను ప్రోత్సహించాలని చెప్పారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ పై నెట్టింట పెద్ద చర్చే జరిగింది.
కేటీఆర్ పోస్ట్ చేసిన వెంటనే కవిత మరో పోస్టుతో పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఇతరులకు చెప్పేముందు మహిళలకు గౌరవం ఇవ్వాలన్నది ముందుగా ఇంటి నుంచే ప్రారంభం కావాలని ఘాటు కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు మహిళలు ఇంట్లోనే సోదరులనుంచి, తండ్రుల నుంచి, భర్తల నుంచి వివక్ష ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ఇది కేటీఆర్‌కు ఇచ్చిన కౌంటరే అని విశ్లేషకులు.
ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా నా దీక్ష కొనసాగుతుంది https://t.co/bjlCjTZmd6 pic.twitter.com/mWxMpNdQwu
— కవిత కల్వకుంట్ల (@RaoKavitha) మార్చి 10, 2026
కవితకు పెరుగుతున్న మద్దతు
మరో వైపు సోషల్ మీడియాలో కవితకు గట్టి మద్దతు లభిస్తున్నట్లు. కేసీఆర్ లాంటి ఉద్దండుడైన నాయకుడికి అసలైన రాజకీయ వారసురాలు కవిత అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. కేసీఆర్ శైలిలోని మొండితనం, సమయస్ఫూర్తి, ప్రజల సెంటిమెంట్‌ను వాడటం వంటి లక్షణాలు కవితలో ఎక్కువగా కనిపిస్తాయని అనేక పోస్టులు పెడుతున్నారు. దీనివల్లే గ్లామరస్ లీడర్ ఎంతైనా, పొలిటికల్ మైలేజ్ విషయంలో కవిత ముందు ఆయన ‘తెలిసుకుంటున్నారు’ అనే డిస్కషన్ ఇప్పుడు ఊపందుకుంది.కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్‌ను ప్రపంచం చూస్తోంది, కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ నాటి ఉద్యమ స్ఫూర్తిని చూస్తున్నారు.ఖమ్మం పోరాటం తర్వాత తెలంగాణ ప్రజల్లో కవిత గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.
తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కవిత అగ్నిపుత్రికలా మారుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు విశ్లేషకులు.కవిత చేస్తున్న పోరాటం ఒక సంజీవనిలా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.
అధికారంలో ఉన్నప్పుడు ఐటీ శాఖను చూసుకోవడం వేరు, అధికారం లేనప్పుడు ప్రజల మధ్య ఉండి పోరాడటం వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో కవిత చూపిస్తున్న చొరవ, ధైర్యం ఆమెను కేటీఆర్ కంటే ఒక మెట్టు పైనే ఉంచుతోంది.

