Monday, March 2, 2026
ads
📄 ePaper
HomeతెలంగాణAPSRTCలో 7673 ఉద్యోగాల భర్తీ..! ప్రమోషన్లు, బకాయిలపై క్లారిటీ...! | APSRTC 7,673 పోస్టుల భర్తీకి...

APSRTCలో 7673 ఉద్యోగాల భర్తీ..! ప్రమోషన్లు, బకాయిలపై క్లారిటీ…! | APSRTC 7,673 పోస్టుల భర్తీకి అనుమతి కోరింది; మంత్రి ఉద్యోగుల ప్రమోషన్లు మరియు సమస్యలను సమీక్షించారు

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సయ్యద్ అహ్మద్

ఏపీలో ఆర్టీసీ (APSRTC) వ్యవహారంపై ఇవాళ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సచివాలయంలో కీలక సమీక్ష జరిగింది. ఇందులో పలు కీలక అధికారులతో చర్చించారు. ఇందులో ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లు, నియామకాలు, బకాయిల చెల్లింపులు, వైద్య కారణాలతో రిటైర్ అయిన ఉద్యోగుల సమస్యలు, కారుణ్య నియామకాలు, సీనియారిటీ జాబితాలు, కోర్టు కేసుల స్థితిగతులపై మంత్రి విస్తృతంగా చర్చించారు.

ఈ సమీక్షలో 2025-26 డీపీసీ కింద అర్హులైన 7,514 మంది ఉద్యోగులకు ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. 20-02-2026లోపు ఎంప్యానెల్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. లెవెల్స్ 3, 4, 5 & ఈల సీనియారిటీ జాబితాల ఆధారంగా డీపీసీలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.
అలాగే వివిధ విభాగాల్లో 7,673 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి కోరిన అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.

APSRTC 7 673 పోస్టులను పూరించడానికి అనుమతిని కోరింది మంత్రి ఉద్యోగుల ప్రమోషన్లు మరియు సమస్యలను సమీక్షించారు

2020లో 51,488 మంది ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం 44,131 మంది మాత్రమే విధుల్లో ఉన్నారని, 2026, 2027, 2028 సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ కానున్నారని మంత్రికి అధికారులు తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్ తదితర పోస్టులకు ప్రాధాన్యతతో భర్తీ చేయాలని మంత్రి సూచించారు. అలాగే 01-01-2020 నుంచి వైద్య కారణాలతో 682 మంది ఉద్యోగులు రిటైర్ అయినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 36 మందికి ప్రత్యామ్నాయ ఉద్యోగం, మిగిలిన 646 మందికి ఆర్థిక పరిహారం చెల్లించాల్సి ఉంది. ఒక్కో ఉద్యోగికి రూ.15 లక్షల చొప్పున మొత్తం ఆర్థిక భారం రూ.96.90 కోట్ల అంచనా వేశారు.

APSRTC 7 673 పోస్టులను పూరించడానికి అనుమతిని కోరింది మంత్రి ఉద్యోగుల ప్రమోషన్లు మరియు సమస్యలను సమీక్షించారు

అలాగే ఉమ్మడి కడప ప్రాంతంలో కండక్టర్ ఖాళీలు లేకపోవడంతో 191 కారుణ్య నియామక దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. 28-09-2023, 29-09-2023 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినా ఇప్పటివరకు నియామకాలు జరగలేదని, ఆర్టీసీలో పదేపదే ఫాలోఅప్ చేసిన కలెక్టర్ కార్యాలయం నుంచి స్పష్టమైన స్పందన రాలేదని మంత్రికి వివరించారు. కడపలో ఉన్న 80 మంది కండక్టర్లు ఇతర రీజియన్లలో పని ఉన్నట్లు తెలిపారు. అలాగే వివిధ కేడర్ల సీనియారిటీ జాబితాల పునఃపరిశీలనకు 30-01-2026న మెమో జారీ చేసింది. హైకోర్టు ప్రకారం, ప్రభుత్వ మెమోల సీనియారిటీ జాబితాల సమీక్ష జరుగుతుంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular