అంతర్జాతీయ
ఓయి-లింగారెడ్డి గజ్జల
ట్రంప్ అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా ఇమ్మిగ్రేషన్ పాలసీల్లో కఠినతరం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా హెచ్-1బీ వీసా అంటేనే విదేశీయులకు గట్టి అడ్డంకులు, భారీ ఫీజులు, కఠిన పరిశీలనలు అన్న భావన ఏర్పడింది. లక్ష వ్యక్తులకు చేరిన వీసా ఖర్చు, సోషల్ మీడియా స్క్రూటినీ, రెన్యువల్ నిబంధనలు… ఇవన్నీ కలిసి “ఇంత ఖర్చు పెట్టి ఎవరు వెళ్తారు?” అనే సందేహాన్ని కలిగించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. కారణం ఒక్కటే – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI).
అమెరికా టెక్ రంగం ప్రస్తుతం ఏఐ చుట్టూ తిరుగుతోంది. భవిష్యత్ ఆధిపత్యం ఎవరిదో తేల్చే యుద్ధం ఇదే అన్నట్టుగా కంపెనీలు వేల కోట్ల డాలర్లను ఈ రంగంలో కుమ్మరిస్తున్నాయి. అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి దిగ్గజాలు ఒక్క ఏడాదిలోనే వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. అయితే సమస్య ఏంటంటే… ఈ భారీ లక్ష్యాలను నెరవేర్చే నైపుణ్యం ఉన్న మానవ వనరులు అమెరికాలో కొరతగా మారాయి.

H1B: 80 శాతం మంది విదేశీయులే
ఇదే సమయంలో ఓ ఆసక్తికరమైన నిజం బయటపడింది. అమెరికా యూనివర్సిటీల్లో కంప్యూటర్ సైన్స్, ఏఐ చదువుతున్న విద్యార్థుల్లో దాదాపు 80 శాతం మంది విదేశీయులే. అమెరికన్ విద్యార్థులు కొత్త తరం టెక్నాలజీల వైపు తక్కువగా మొగ్గు చూపడం కంపెనీలకు తలనొప్పిగా మారింది. ఫలితం? “దేశీయులకు ఉద్యోగాలు” అనే నినాదం కంటే “సరైన టాలెంట్ కావాలి” అనే అవసరం ముందుకు వచ్చింది.
2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాఖలైన లేబర్ కండిషన్స్ అప్లికేషన్‌లలో 80 శాతం పైగా ఏఐ ఆధారిత నియామకాల కోసమే ఐఐసి చెబుతోంది. అమెజాన్ ఒక్కటే వేల మంది విదేశీ నిపుణులను తీసుకోగా, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ కూడా అదే దారిలో నడిచింది. లక్ష డాలర్ల హెచ్-1బీ ఫీజు కూడా ఈ కంపెనీలకు ఇప్పుడు పెద్ద భారం కాదు. ఎందుకంటే ఏఐ రేసులో వెనుకబడితే నష్టం ఇంకా పెద్దదని వారికి బాగా తెలుసు.
భారతీయులకే ఎక్కువ అవకాశాలు..
ఈ మారుతున్న పరిస్థితుల్లో భారతీయ టెక్ నిపుణులు ప్రత్యేకంగా ఫోకస్‌లోకి వచ్చారు. అమెరికాలో చదువుకున్న భారతీయులు మొదట OPT ద్వారా పని చేస్తూ, తర్వాత హెచ్-1బీనే తమ భవిష్యత్‌గా చూస్తున్నారు. కంపెనీలు కూడా దీర్ఘకాల అవసరాల కోసం ఖరీదైన వీసా ఖర్చులను సిద్ధంగా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, రీసెర్చ్, ఏఐ మోడల్ డిజైన్ వంటి కీలక విభాగాల్లో భారతీయులకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు అడ్డంకిగా మారిన హెచ్-1బీ వీసా ఇప్పుడు ఏఐ యుగంలో హై డిమాండ్ టికెట్‌గా మారింది. ఇమ్మిగ్రేషన్ పాలసీలు కఠినంగానే ఉన్నా, టాలెంట్ అవసరం వాటిని దాటేస్తోంది. ట్రంప్ కాలంలో బిగుసుకున్న… ఏఐఐ అవసరాలతో మళ్లీ తెరుచుకుంటున్నది ప్రస్తుతం అమెరికా టెక్ వినిపిస్తున్న అసలు కథ.

