Sunday, November 22, 2026
ads
📄 ePaper
Homeరాజకీయంవెల్దుర్తి సర్పంచ్ పీఠమే లక్ష్యంగా ప్రచార హోరు.. పుష్పావతి విజయంపై శ్రేణుల ధీమా!

వెల్దుర్తి సర్పంచ్ పీఠమే లక్ష్యంగా ప్రచార హోరు.. పుష్పావతి విజయంపై శ్రేణుల ధీమా!

📰 Generate e-Paper Clip

15, 16వ వార్డుల్లో జ్ఞానేశ్వర్ గౌడ్‌కు ఘన స్వాగతం

 

వార్డువార్డునా ప్రచార హోరు.. పుష్పావతికి మద్దతుగా జ్ఞానేశ్వర్ గౌడ్ విస్తృత ప్రచారం

 

 

కర్నూలు ప్రతినిధి / వెల్దుర్తి, నవంబర్ 17 (సీమకిరణం న్యూస్):

వెల్దుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎల్.ఈ. పుష్పావతి విజయమే లక్ష్యంగా టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎంపీపీ, టీడీపీ సీనియర్ నాయకులు ఎల్.ఈ. జ్ఞానేశ్వర్ గౌడ్ 14, 15, 16వ వార్డుల్లో ముమ్మరంగా పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే టీడీపీ అభ్యర్థి ఎల్.ఈ. పుష్పావతికి తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. వార్డుల్లోని ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.

 

స్థానిక ప్రజల నుంచి ఘన స్వాగతం

 

ఎల్.ఈ. జ్ఞానేశ్వర్ గౌడ్ చేపట్టిన ప్రచార కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా 15, 16వ వార్డులకు చేరుకున్న ఆయనకు స్థానిక ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. పలుచోట్ల బాణాసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలు తమపై మరింత బాధ్యతను పెంచుతున్నాయని, పార్టీ అభ్యర్థి పుష్పావతి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని జ్ఞానేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు పూల రాముడు, హరికృష్ణ, గిడ్డయ్య, హరి, రాజేష్, సూరి రమణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular