ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలపై ఆరా.. ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి
కర్నూలు ప్రతినిధి/వెల్దుర్తి, నవంబర్ 17 (సీమకిరణం న్యూస్):
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇందులో భాగంగా సర్పంచ్ అభ్యర్థి, మండల వైకాపా కన్వీనర్ బొమ్మన రవిరెడ్డి మంగళవారం గ్రామంలోని 1, 2వ వార్డుల్లో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ, గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అమూల్యమైన ఓటు వేసి ఒక్క అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలతో మమేకమవుతూ సాగిన ఈ ప్రచార కార్యక్రమానికి వార్డుల్లో మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మన పెద్దిరెడ్డి, బొమ్మన రఘురెడ్డి, అనిల్ రెడ్డి, ఆరిఫ్, చక్రపాణిరెడ్డి, మధు, నాగిరెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

