Monday, March 2, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్విలేకరులు అందరూ కలిసి మెలిసి ఉండాలి

విలేకరులు అందరూ కలిసి మెలిసి ఉండాలి

📰 Generate e-Paper Clip

విలేకరులు అందరూ కలిసి మెలిసి ఉండాలి : డాక్టర్. శంకర్ శర్మ

 

కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 19, (సీమకిరణం న్యూస్):

 

సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలుజిల్లా సమాచార భవన ఆవరణలో జర్నలిస్టుల ప్రమాద భీమాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్. శంకర్ శర్మ ముఖ్య అతిథిగా వచ్చి విలేకరులకు ప్రమాద భీమా చేయించారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూ సమాజంలో జరిగే సంఘటనలు విలేకరుల ద్వారా ప్రజలకు తెలుస్తాయన్నారు. రాజకీయ పార్టీలు సొంతంగా ఛానల్స్ పెట్టుకొని ప్రజలను ప్రభావితం చేస్తున్నారన్నారు. ఇలాంటి తరుణంలో సోషల్ మీడియా వచ్చిందని సోషల్ మీడియాపై నియంత్రణ ఎంతైనా అవసరం అని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు. సోషల్ మీడియా పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విలేకరులు వార్తల కోసం నిరంతరం కష్టపడుతుంటారని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు సైతం మీడియా ద్వారానే ప్రజలకు చేరుతాయన్నారు. విలేకరులు విధి నిర్వహనలో చాలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రతినిధులు రఘబాబు, చెన్నయ్య, విలేకరులు రామస్వామి, వలి,రంగ,అవినాష్, జాకీర్, శీను, బాష తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular