తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
వంట గ్యాస్ సరఫరాకు బిగ్ అలర్ట్. వంట గ్యాస్ సరఫరాకు గండం పొంచి ఉంది. పశ్చిమా సియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం చమురు సరఫరా పై పడింది. దీంతో.. నాలుగు రోజులుగా వంట గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ ఒత్తిడి పెరుగుతోంది. దీంతో.. అనధికారికంగా ఆంక్షలను ఆయిల్ కంపెనీలు అమలు చేస్తున్నాయి. ఫలితంగా వినియోగదారుల ఆందోళన పెరుగుతోంది. బుకింగ్ కోసం తాజాగా నిర్దేశించిన గడువు పూర్తి అయిన తరువాతనే రిజిస్టర్ చేసుకోవటం ఈ ఆందోళన కారణంగా నిలుస్తోంది.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో వంటగ్యాస్ (ఎల్‌పిజి) సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముడి చమురు నిల్వలు దాదాపు 8 వారాల వరకు సరఫరా, సరఫరా పూర్తిగా నిలిచిపోతే ఇంధన రేషనింగ్ చేయాల్సిన గడ్డు పరిస్థితి తప్పదనే అంచనాలు మొదలయ్యాయి. ఫలితంగా డొమెస్టిక్ వంట గ్యాస్ వినియోగదారులు ముందుగానే గ్యాస్ రీఫిల్స్ కోసం పెద్ద ఎత్తున బుక్ చేసుకుంటున్నారు. గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ బుకింగ్ కోసం వినియోగదారులు పెద్ద సంఖ్యలో బుక్ చేసుకుంటున్నారు. ఒత్తిడి పెరుగుతున్న వేళ ప్రధాన ఆయిల్ కంపెనీల డీలర్లు అనధికారికంగా సిలిండర్ బుకింగ్ పైన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇందు కోసం డబుల్ సిలిండర్ ఉన్న వారికి 30 రోజులు.. సింగిల్ సిలిండర్ ఉన్న వారికి 21 రోజులు గడువు విధించారు.

సిలిండర్ల బుకింగ్ పై ఆంక్షలు
చివరి సిలిండర్ అందుకున్న రోజు నుంచి 21 రోజుల తరువాత అయితే గ్యాస్ సిలిండర్ తిరిగి బుక్ చేసుకుంటామని చెప్పారు. ఆయిల్ కంపెనీల నుంచి అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాకపోయినా… ఉత్పత్తి నుంచి పెరుగుతున్న బుకింగ్ ఒత్తిడిని తగ్గించేందుకు ఈ ఆంక్షలను అమలు చేస్తున్నారు. యుద్ద ప్రభావంతో రానున్న రోజుల్లో వంట గ్యాస్ కు కొరత ఏర్పడుతుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనితో.. గతం కంటే ఒకే సారి రెట్టింపు సంఖ్యలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ లు జరుగుతున్నాయి. నిర్దేశిత గడువు మేరకే బుకింగ్స్ జరిగే విధంగా ఆయిల్ కంపెనీలు వినియోగదారులు ఉపయోగించే పోర్టల్స్, యాప్ ల సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసారు. దీంతో.. ఈ యుద్ధం మరింత కాలం కొనసాగితే వంట గ్యాస్ తో పాటుగా పెట్రోల్, డీజిల్ సరఫరాలోనూ సమస్యలు వస్తాయనే చర్చ సాగుతోంది.

