ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
సంచలనంగా మారిన లడ్డూ వ్యవహారంలో మరో కీలక మలుపు. ఇప్పటికే ఈ అంశం రాజకీయంగా పతాక స్థాయికి చేరింది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు లడ్డూ వివాదం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 26న మండలిలో ఇందాపూర్ – హెరిటేజ్ పైన వస్తున్న విమర్శల పైన చర్చ జరగనుంది. లడ్డూ పైన వివాదం ప్రభుత్వం తాజాగా ఏకసభ్య కమిటీని నియమించింది. ఈ సమయంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది.
లడ్డూ వివాదం పై సుప్రీం నియమించిన సిట్ సుదీర్ఘ విచారణ చేసింది. ఛార్జీ దాఖలు చేసింది. అందులో కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ నివేదిక ఆధారంగా కూటమి – వైసీపీ మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయంగా విమర్శలు చెలరేగాయి. కాగా.. కేబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రభుత్వం లడ్డూ పై ఏకసభ్య కమిషన్ను నియమించింది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్కు విచారణ బాధ్యతలు అప్పగించారు. అటు సిట్ విచారణలో ఉండగా.. ప్రభుత్వం మరో కమిటీ నియామకం పైన సుప్రీకోర్టులో సుబ్రమణ్య స్వామి పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన సుప్రీం ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ జరగాలని తేల్చి చెప్పండి. సిట్.. ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకరి విచారణ మరొకరు పైన ప్రభావం పడకుండా చట్టానికి లోబడి విధులు నిర్వహించాలని స్పష్టం చేసింది.

45 రోజుల్లో నివేదిక.. ఏం తేల్చబోతున్నారు
దీంతో, ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ పని ప్రారంభించేందుకు సిద్దమైంది. తాజాగా ఉండవల్లి నివాసం లో సీఎం చంద్రబాబుతో వన్ మ్యాన్ కమిటీ సభ్యులు మాజీ చీఫ్ సెక్రెటరీ దినేష్ కుమార్ భేటీ అయ్యారు. బాధ్యత కమిటీలు తీసుకున్న దినేశ్ కుమార్.. తిరుపతి కేంద్రంగా పూర్తి విచారణ చేసే అవకాశం ఉంది. కల్తీ నెయ్యి సరఫరా అంశంలో జరిగిన నిర్లక్ష్యం …దానికి బాధ్యులు అయిన ఉద్యోగుల పై చర్యలకు దినేశ్ కుమార్ తనిఖీ చేసే అవకాశం ఉన్నట్లు లేదు. 45 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. అయితే, ఈ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలు.. సిట్చార్జ్లో తేలిన అంశాలు.. ఇప్పుడు దినేష్ కుమార్ విచారణ వేళ అవే అంశాలు వెలుగులోకి వస్తాయా.. కొత్తగా మారేదైనా తేల్చుతారా అనేది ఆసక్తిగా మారుతోంది. అయితే.. దినేశ్ కుమార్ కమిటీ నియామకం సమయంలోనే ప్రభుత్వ అసలు లక్ష్యం స్పష్టం చేసింది. దీంతో.. ఇప్పుడు ఈ కమిటీ ఎవరిని విచారించబోతోందంటే… ఎలాంటి సమాచారం రాబడుతోంది… 45 రోజుల్లో ఇచ్చే నివేదికలో ఎవరిని బాధ్యులను చేస్తుందనేది రాజకీయంగానూ ఉత్కంఠ పెంచుతోంది.

