ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
ఏపీ ప్రభుత్వం భారీ అంచనాలతో 2026-27 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వం లో సాగిన పాలన పైన విమర్శలు చేసారు. రాష్ట్ర విభజన ఒక నష్టం అయితే… ఆ తరువాత అయిదేళ్లు రాష్ట్రానికి నష్టం చేసిందని. ఈ బడ్జెట్ కేవలం పద్దులే కాదని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందన్నారు. అభివృద్ధి- సంక్షేమంతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలనేదే తమ విధానమని స్పష్టం చేసారు.
రాష్ట్ర బడ్జెట్ 2026-27 ను ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. రానున్న ఆర్దిక సంవత్సరానికి రూ 3,32,205 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ఈ బడ్జెట్ ప్రతిపాదించినట్లు. రాయలసీమ రైతుల కలలను సాకారం చేసేలా ప్రాధాన్యత ఇచ్చామన్నారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించామని ఆర్దిక మంత్రి వివరించారు. కీలక రంగాలకు కేటాయింపులు భారీగా పెంచారు. వ్యవసాయ శాఖకు రూ. 11,745 కోట్లు, పాఠశాల విద్యకు రూ. 32, 208, బీసీ సంక్షేమం రూ. 23650 కోట్లు, ఇంధన శాఖ- 19,306 కోట్లు, పంచాయితీ రాజ్‌కు రూ. 22,941 కోట్లు, ఇరిగేషన్ 18,223 కోట్ల మేర కేటాయింపులు ప్రతిపాదించారు. అన్నదాత సుఖీభవ కోసం రూ 6,600 కోట్లు, మత్స్యకార సేవకు 600 కోట్లు, ధరల స్థిరీకరణ కు రూ 560 కోట్లు కేటాయింపులు చేసారు.

ప్రాథమిక సౌకర్యాలకు ప్రాధాన్యత
విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. తల్లికి వందనం కోసం రూ 9,600 కోట్లు ప్రతిపాదించారు. విద్యా మిత్ర కోసం రూ 654 కోట్లు కేటాయించారు. పోలవరం కోసం రూ 6,105 కోట్లు ప్రతిపాదన చేసారు. మున్సిపల్ శాఖకు 14,358 కోట్లు, EWS సంక్షేమం కోసం 10,699 కోట్లు అమరావతి కోసం ఆరు వేల కోట్లు, ఉన్నత విద్య కోసం రూ 2,566 కోట్లు, మహిళా శిశు సంక్షేమం కోసం రూ 4,581 కోట్లు ప్రతిపాదించారు. మన బడి- మన భవిష్యత్ కోసం రూ 155 కోట్లు ప్రతిపాదించారు.

