Tuesday, April 21, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణమున్సిపల్ ఎన్నికల ఫలితాలు..9మున్సిపాలిటీలలో హంగ్..అక్కడ వీరే కింగ్ మేకర్లు! | పురపాలక ఎన్నికల ఫలితాలు..9 మున్సిపాలిటీల్లో...

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..9మున్సిపాలిటీలలో హంగ్..అక్కడ వీరే కింగ్ మేకర్లు! | పురపాలక ఎన్నికల ఫలితాలు..9 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌విఎస్‌లు హంగ్‌.. స్వతంత్రులు కింగ్‌మేకర్‌లు

📰 Generate e-Paper Clip


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అత్యంత ఉత్కంఠ భరితంగా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల కౌంటింగ్ పూర్తికాగా, మున్సిపాలిటీలలో నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా పోరు సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది.

9 మున్సిపాలిటీలలో హంగ్

పలుచోట్ల బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తుండగా, బీజేపీ మూడో స్థానంలో కొనసాగుతోంది. చాలా మున్సిపాలిటీలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన సమరం కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో కొన్ని మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది మున్సిపాలిటీల పరిధిలో రాజకీయ వర్గాల్లోనూ, ప్రజలలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఇప్పటివరకు జహీరాబాద్, కేసముద్రం, కోహిర్, దేవరకద్ర, అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్‌తో సహా తొమ్మిది మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది.

మునిసిపల్ ఎన్నికల ఫలితాలు 9 మున్సిపాలిటీల్లో హంగ్‌లో ఉన్న కాంగ్రెస్‌లు స్వతంత్రులు కింగ్‌మేకర్‌లు

అక్కడ వారిదే హవా

ఈ మున్సిపాలిటీలలో గెలిచిన స్వతంత్రులు కీలకం కానున్నారు. అయితే ఎక్స్‌’ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న చర్చ జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 16 వార్డులు ఉండగా కాంగ్రెస్ ఎనిమిది, బిఆర్ ఎస్ ఎనిమిది స్థానాలను గెలుచుకున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు సమానంగా వార్డులు గెలుచుకోవడంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది.

కింగ్ మేకర్లుగా ఇండిపెండెంట్ లు

ఇక్కడ కేసముద్రం మున్సిపాలిటీ ఏ పార్టీ ఖాతాలో పడుతుందో అన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తమౌతుంది. ఇదిలా ఉంటే జనగామ మున్సిపాలిటీలో కూడా చైర్మన్ పీఠం పైన ఉత్కంఠ ఏర్పాటు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఇద్దరు సమానంగా 13, 13 స్థానాలను గెలుచుకోగా హంగ్ ఏర్పడింది. ఇక్కడ నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. ఇక వీరే జనగామలో కింగ్ మేకర్లు కాబోతున్నారు.

హంగ్ ఏర్పడిన చోట బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

అయితే హంగ్ ఏర్పడిన చోట కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయి అన్న చర్చ స్థానికంగా జరుగుతుంది. మెజార్టీ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని శత విధాల ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకుంటుందా లేదా అన్నది చూడాలి.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular