భారతదేశం
oi-Oneindia సిబ్బంది
మరో రెండు నెలల్లో తమిళనాడు రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.దీంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నేతల మధ్య మాటలు కోట్లు దాటుతున్నాయి.నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి హీట్ పెరిగిపోయింది.తాజాగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైర్ నాగేంద్రన్ తమిళ నటుడు-టీవీకే పార్టీ అధినేత విజయ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విజయ్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇంతకీ నైనార్ నాగేంద్రన్ ఏమన్నారు..?
త్రిషతో విజయ్‌ని ముడిపెడుతూ…
ఇంకా వేసవికాలం రాకముందే తమిళనాడు రాజకీయాలు రాష్ట్రాన్ని నిప్పుల కుంపటిలా మారుస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నార్ నాగేంద్రన్ టీవీకే పార్టీ అధినేత విజయ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటి త్రిషతో విజయ్‌ను ముడిపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు టీవీకే కార్యకర్తలు, అభిమానుల ఆగ్రహం తెప్పించాయి. హీరోయిన్ త్రిష నుంచి విజయ్ బయటకు వస్తేనే ఏమైనా జరుగుతుందంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు నాగేంద్రన్‌ను ఇరకాటంలోకి నెట్టాయి. విజయ్ వ్యక్తిగత,రాజకీయ అనుభవాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు నైనార్ నాగేంద్రన్ పార్టీని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు.విజయ్ రాజకీయ అనుభవాన్ని ఆయన TVK ఓటు బ్యాంకు వాదనలను కొట్టిపారేయడంతో పాటు అధికార DMKపైనా విమర్శలు గుప్పించారు.మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ రాజకీయ విశ్వసనీయతను, అనుభవాన్ని నాగేంద్రన్ తనదైన శైలిలో తీవ్రంగా ప్రశ్నించారు. “పాపం విజయ్‌కి ఏమీ తెలియదు; అతనికి ఉన్న అనుభవం. ముందు అతని ఇంటి నుండి బయటకు రావాలని చెప్పండి. త్రిషతో తన సంబంధం నుండి అతను బయటపడితేనే వాస్తవాలను చూడగలడు. ఒక రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి ప్రయత్నించే ముందు అతను తన కుటుంబ సంబంధాలను సరిచేసుకోవాలి. తన కుటుంబంలో సరైన సంబంధాలను కొనసాగించాలి, గొప్ప నాయకులు ఉద్యమాలను ఎలా నిర్మించాలో నేర్చుకోవాలి” అని.
ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరనట్టు
తన వాదనను మరింత బలంగా వినిపించేందుకు నాగేంద్రన్ ఒక సామెతను చెప్పుకొచ్చారు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరనట్టు ఉంది విజయ్ తీరు అంటూ సెటైర్ వేశారు. ప్రతిదానికి అనుభవం కావాలి అని చెప్పుకొచ్చిన నాగేంద్రన్ కుండలో ఏది ఉందో అదే పోయిందని చెప్పవచ్చు.ఓటు షేర్ గురించి TVK చేసిన వాదనలను కూడా నాగేంద్రన్ కొట్టిపారేశారు. ఒక నటుడు అయినంత మాత్రాన అతడు 32% ఓట్లను దక్కించుకుంటాడని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. ఒకప్పుడు విజయకాంత్ సభలకు కూడా భారీగా జనసందోహం తరలివచ్చేదని గుర్తు చేసిన నాగేంద్రన్…అవి ఓట్లుగా మార్చుకోవడంలో విజయకాంత్ విఫలమయ్యారని చెప్పారు.
ద్వారా CRASS వ్యాఖ్యలు #బిజెపి తమిళనాడు చీఫ్ నైనార్ నాగేంద్రన్ #TVK చీఫ్ @TVKVijayHQ
బహుళ చిత్రాలలో తలపతి విజయ్‌తో కలిసి నటించిన నటి త్రిషను ఉద్దేశించి మరియు లక్ష్యంగా చేసుకున్న చౌకైన వ్యాఖ్యలు @TVKPartyHQ #TNPolitics pic.twitter.com/pmYpNFrCJ8
— అపూర్వ జయచంద్రన్ (@Jay_Apoorva18) ఫిబ్రవరి 13, 2026
మొత్తానికి తమిళనాట రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఈ సారి ఎన్నికలపై చాలా గట్టిగా ఫోకస్ చేసింది కమలం పార్టీ. వీలైనన్ని ఎక్కవ సీట్లపై కన్నేసింది. ఓటు శాతం కూడా ఈసారి బీజేపీకి పెరిగే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే విజయ్ పార్టీ ఎంట్రీతో ప్రధాన పార్టీలైన డీఎంకే కాంగ్రెస్ కూటమి, అన్నాడీఎంకే బీజేపీ కూటమిలకు చెమటలు పడుతున్నాయని అక్కడి అనలిస్టులు చెబుతున్నారు. విజయ్ రాకతో ఏ పార్టీకి ఓట్లు చీలుతాయో అంతు చిక్కడం లేదని పలు సర్వే సంస్థలు కూడా భావిస్తున్నాయి.

