Thursday, April 23, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణమార్చిలో పాఠశాలలకు వరుస సెలవులు, వరుసగా - ఇదీ లిస్టు...!! | మార్చి నెలలో పాఠశాలలకు...

మార్చిలో పాఠశాలలకు వరుస సెలవులు, వరుసగా – ఇదీ లిస్టు…!! | మార్చి నెలలో పాఠశాలలకు సెలవుల జాబితాను యాజమాన్యాలు ప్రకటించాయి, వివరాలు ఇక్కడ ఉన్నాయి

📰 Generate e-Paper Clip


తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

పాఠశాలలకు వచ్చే నెలలో భారీగా సెలవులు రాబోతున్నాయి. ఒక వైపు పరీక్షల సీజన్ ప్రారంభం అయింది. ఒంటి పూట బడుల షెడ్యూల్ ను ప్రకటించింది. ఇప్పటికే ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు పంపిణీ చేసి.. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక.. టెన్త్ బోర్డు పరీక్షలు మొదలు కానున్నాయి. కాగా.. మార్చి నెలలో పరీక్షలకు రిలీఫ్ కలిగించేలా కొన్ని సెలవులు వస్తున్నాయి. వీకెండ్స్, పండుగలు కలుపుకొని ఏపీ, తెలంగాణ విద్యార్థులకు మొత్తం 11 రోజుల పాటు సెలవులు రానున్నాయి.

మార్చిలో విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి. వారంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు సెలవులు వస్తున్నాయి. మార్చి 3వ తేదీన హోలీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అదే విధంగా మార్చి 19న తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ. ఈ పాఠశాలలకు సెలవు ఉంటుంది. అలాగే మరుసటి రోజు మార్చి 20వ తేదీన రంజాన్ పండగా, అలాగే మార్చి 21న శనివారం వస్తుంది. ఈ ఒక్క రోజు కొన్ని పాఠశాలలు కొనసాగుతాయి. మరి కొన్ని పాఠశాలలకు సెలవు ఇచ్చే అవకాశం ఉంది. ఇక మార్చి 27న శ్రీరామ నవమి, మార్చి 31న మహావీర్ జయంతి (ఆప్షన్ హాలీడే) వంటి పండుగల్లో పాఠశాలలకు సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఇక మార్చి 14న రెండో శనివారం పాఠశాలలకు సెలవు ఉండనుంది. వీటితో పాటు మార్చి నెలలో 5 ఆదివారాలు ఉన్నాయి. మార్చి నెలలో మొత్తం 11 రోజుల పాటు సెలవులు రానున్నాయి.

మార్చి-నెలలో-పాఠశాలలకు సెలవులు-లిస్ట్-నిర్వహణలు-ఇక్కడ-డిటా-ప్రకటించబడ్డాయి.

మార్చి లో పండగలు.. వరుస సెలవులతో

ఇదిలా ఉండగా, ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణలో మార్చి 10 -25 తేదీల మధ్య పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటి పూట బడులు కూడా మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో విద్యా శాఖ అధికారికంగా ఒంటి పూట బడుల షెడ్యూల్ ను ప్రకటించింది. కొత్త టైమింగ్స్ ప్రకారం మార్చి 16 నుంచి స్కూళ్లు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటాయి. ఇక.. ఇప్పటికే అనేక పాఠశాలల్లో పదో తరగతి కోసం విద్యార్ధులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. సాధారణ పరీక్షలు మార్చి నెలలో పూర్తి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వేసవి సెలవులు ఏప్రిల్ నాలుగో వారంలో మొదలై జూన్ రెండో వారం వరకు కొనసాగే అవకాశం ఉంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular