మస్తానయ్య స్వామి దర్గాను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ
ప్రజలందరూ సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండాలి : మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ
స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ
పత్తికొండ /తుగ్గలి, ఫిబ్రవరి 07, (సీమకిరణం న్యూస్):

తుగ్గలి మండలం పరిధిలోని ముక్కెళ్ల గ్రామంలో శనివారం జరిగిన మస్తానయ్య స్వామి ఉరుసు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ మస్తానయ్య స్వామి దర్గాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక వైసిపి నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మని శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజవర్గంలోనే ప్రజలందరూ సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండాలని స్వామికి పూజలు చేసినట్లు తెలిపారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవితో పాటు గ్రామ ప్రజలు దర్గాను దర్శించుకుని తమ మొక్కలు తీర్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గారి వెంట జిల్లా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నగేష్ యాదవ్, పత్తికొండ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ నాగభూషణ్ రెడ్డి, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు అట్లా గోపాల్ రెడ్డి, స్థానిక వైసిపి నాయకులు బండపల్లి చంద్రన్న, గిడ్డయ్య ,బండపల్లి వెంకటేష్, గోవర్ధన్ రెడ్డి, రంగుడు, లక్ష్మణస్వామి, చిరంజీవి,మునెప్ప, డిష్ సూరి, చంద్రశేఖర్ యాదవ్, గుడుంబాటి రామానాయుడు, రాజు, రాజశేఖర్, తదితరుల పాల్గొన్నారు.

