Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణమళ్ళీ గ్రామపంచాయతీలకు పండుగే.. రూ. 387 కోట్ల నిధులు విడుదల! | గ్రామ పంచాయతీలకు శుభవార్త.....

మళ్ళీ గ్రామపంచాయతీలకు పండుగే.. రూ. 387 కోట్ల నిధులు విడుదల! | గ్రామ పంచాయతీలకు శుభవార్త.. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్‌లుగా కేంద్రం మళ్లీ 387 కోట్ల రూపాయలను విడుదల చేసింది

📰 Generate e-Paper Clip


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

కేంద్ర ప్రభుత్వం మరోమారు గ్రామపంచాయతీలకు శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం కింద గ్రామ పంచాయతీలకు 387 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడత 259.36 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్రం, రెండవ విడత 387 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ నిధులు 646. 36 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్న కేంద్రం

తెలంగాణ రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నుంచి మొత్తం మూడు వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా అవి తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికలకు ముందు సాంకేతిక సమస్యలతో ఆగిపోయాయి. ప్రస్తుత గ్రామపంచాయతీల ఎన్నికలు పూర్తి అయ్యి కొత్త సర్పంచ్‌లు పాలనా పగ్గాలు చేపట్టిన వేళ వరుసగా గ్రామపంచాయతీల నిధులు విడుదల కావడం పంచాయతీల కొత్త సర్పంచులకు సంతోషాన్ని కలిగిస్తుంది.

గ్రామ పంచాయతీలకు శుభవార్త 15వ ఆర్థిక సంఘం గ్రాంట్‌లుగా కేంద్రం మళ్లీ 387 కోట్ల రూపాయలను విడుదల చేసింది

ఇప్పటివరకు గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇదే

గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తిచేసి కేంద్రం కోరిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా విడతలవారీగా పంచాయతీలకు రావాల్సిన నిధులు విడుదల అవుతున్నాయి. మొత్తం మూడు వేల కోట్ల రూపాయల బకాయిలను కేంద్రం ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు రెండు విడతలు 646. 36 కోట్ల రూపాయలు రాగా, ఇంకా 2,400 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది.

గ్రామ పంచాయతీ నిధుల కోసం ఎవరెం చేశారు

గ్రామాల అభివృద్ధి పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయడానికి తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్రం పైన ఒత్తిడి తెచ్చినట్లు, ఫలితంగా నిధులు విడుదల అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియకు ముందు సాంకేతిక కారణాలతో నిధులు విడుదల కాలేదని, ఎన్నికల తర్వాత ప్రస్తుత కేంద్రం నిధులను విడుదల చేస్తుందని బీజేపీ చెబుతోంది.

ఈ నిధులతో అభివృద్ధి.. గ్రామాలలో హర్షం

ఈ మేరకు తాము కేంద్రానికి విజ్ఞప్తి చేశామని బిజెపి మంత్రులు సైతం చెబుతున్నారు. ఒక వారం రోజుల వ్యవధిలోనే రెండు విడతల నిధులు విడుదల కావడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ నిధులు గ్రామాలలో అభివృద్ధి చెందడానికి గ్రామాలలో హర్షం వ్యక్తం చేశారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular