Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణబ్లింకిట్: కత్తులు ఆర్డర్ చేస్తున్నారా? కేసు పెడతారు! | అక్రమ కత్తులు విక్రయించినందుకు బ్లింకిట్‌పై ఢిల్లీ...

బ్లింకిట్: కత్తులు ఆర్డర్ చేస్తున్నారా? కేసు పెడతారు! | అక్రమ కత్తులు విక్రయించినందుకు బ్లింకిట్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు; స్టింగ్ ఆపరేషన్‌లో 50 ఆయుధాలు స్వాధీనం

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయి-లింగారెడ్డి గజ్జల

ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో నిత్యావసరాలు డెలివరీ చేసే ‘బ్లింకిట్’ (బ్లింకిట్) ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. నిమిషాల వ్యవధిలోనే ఆర్డర్ చేసిన వాటిని పంపే వేగంతో, ఏకంగా నిషేధిత మరణాయుధాలను పోలీస్ స్టేషన్‌కే డెలివరీ చేసి పోలీసులకు దొరికిపోయింది. పశ్చిమ ఢిల్లీలోని ఖయాళ పోలీసులు ఈ ‘స్టింగ్ ఆపరేషన్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఖయాలా ప్రాంతంలో ఇటీవల జరిగిన రెండు వరుస హత్యలు పోలీసులను ఉలిక్కిపడేలా చేశాయి. నిందితులకు ఉపయోగించిన కత్తులను ఎక్కడ కొన్నారని ఆరా తీయగా, అవి ఆన్‌లైన్ క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా డెలివరీ అయినట్లు తేలింది. దీనితో రంగంలోకి దిగిన వెస్ట్ ఢిల్లీ డీసీపీ దరడే శరద్ భాస్కర్ బృందం, ఈ ప్లాట్‌ఫారమ్‌ల గుట్టు రట్టు చేయాలని నిర్ణయించుకుంది.

స్టింగ్ ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్న 50 ఆయుధాలను అక్రమ కత్తులు విక్రయించినందుకు బ్లింకిట్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు

పోలీస్ స్టేషన్ నుంచే బ్లింకిట్ లో ఆర్డర్..

బ్లింకిట్ నిజంగానే నిషేధిత ఆయుధాలను పరీక్షించడానికి ఫిబ్రవరి 13న ఒక కానిస్టేబుల్ పక్కా ప్లాన్ వేశారు. మధ్యాహ్నం 3:43 గంటలకు రూ. 710 చెల్లించి ఆన్‌లైన్‌లో ఒక కత్తిని ఆర్డర్ చేశారు. డెలివరీ అడ్రస్ కింద ఏకంగా ‘ఖయాలా పోలీస్ స్టేషన్ సెకండ్ ఫ్లోర్’ అని ఇచ్చారు. సాయంత్రం 4:05 గంటలకు ఆర్డర్ చేసిన కేవలం 22 నిమిషాలకే.. ఆ కత్తి స్టేషన్ ఆవరణలో డెలివరీ అయ్యింది. పోలీస్ స్టేషన్‌కే ఆయుధాన్ని పంపేంత తెగింపు చూసి పోలీసులు విస్తుపోయారు.

నియమాలను తుంగలో తొక్కి..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, 7.62 సెం.మీ పొడవు, 1.72 సెం.మీ వెడల్పు మించిన బ్లెడ్ ​​ఉన్న కత్తులను అమ్మడం నేరం. కానీ, బ్లింకిట్ పంపిన ‘గరారిదార్’ రకం కత్తి బ్లెడ్ ​​8 సెం.మీ పొడవు, 2.5 సెం.మీ వెడల్పు ఉంది. ఇది పక్కాగా చట్టవిరుద్ధమైన ఆయుధమని నిర్ధారించిన పోలీసులు, వెంటనే ఆయుధాల చట్టంలోని సెక్షన్లు 25, 54, 59 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

డార్క్ దుకాణాలపై దాడులు.. 50 కత్తుల సీజ్!

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఢిల్లీలోని వివిధ ‘డార్క్ స్టోర్ల’ నుండి 16 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత హర్యానాలోని గురుగ్రామ్, ఫరూఖ్‌నగర్‌లలో ఉన్న బ్లింకిట్ మెయిన్ గిడ్డంగులపై దాడులు చేసి మరో 32 కత్తులను సీజ్ చేశారు. ఇప్పటివరకు మొత్తం 50 మంది నిషేధిత కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంపై బ్లింకిట్ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదు. చట్టవిరుద్ధమైన ఆయుధాల నిల్వ, పంపిణీ వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular