Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణబంగ్లాదేశ్ ఎన్నికల్లో అనూహ్య మలుపు: కనీవినీ ఎరుగని భారీ మెజారిటీ సాధించిన పార్టీ | బంగ్లాదేశ్...

బంగ్లాదేశ్ ఎన్నికల్లో అనూహ్య మలుపు: కనీవినీ ఎరుగని భారీ మెజారిటీ సాధించిన పార్టీ | బంగ్లాదేశ్ BNP భారీ విజయానికి సిద్ధంగా ఉంది, తారిక్ రెహమాన్ సంపూర్ణ మెజారిటీతో ప్రధానమంత్రి పదవికి సిద్ధమయ్యారు

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

ఓయ్-చంద్రశేఖర్ రావు

బంగ్లాదేశ్ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. గురువారం ఆ దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఘన విజయాన్ని కలిగి ఉంది. ఈ తెల్లవారు జామున 4:30 గంటలకు అందిన సమాచారం ప్రకారం.. ఆ పార్టీ మొత్తం 209 నియోజకవర్గాల్లో జెండా పాతింది. ఆ పార్టీ అధినేత తారిక్ రెహమాన్ తదుపరి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

2024 నాటి ప్రజాందోళనల తర్వాత బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరిగాయి. ప్రజలు కొత్త పార్లమెంట్ ను ఎన్నుకోవడానికి, రాజ్యాంగంలో ప్రతిపాదిత మార్పులు (జూలై చార్టర్)పై తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 12 కోట్ల మందికి పైగా ఓటర్లు ఓటువేశారు.

బంగ్లాదేశ్ BNP భారీ మెజారిటీతో తారిఖ్ రెహమాన్ ప్రధానమంత్రి పదవికి సిద్ధంగా ఉంది

బీఎన్పీ నాయకుడు, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి తారిక్ రెహమాన్ రెండు నియోజకవర్గాలు ఢాకా-17, బోగురా-6 స్థానాల నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. బీఎన్పీ మెజారిటీ సీట్లను సాధించిన వెంటనే బీఎన్పీలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఢాకా, చిట్టాగాంగ్ సహా దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు వేడుకలను జరుపుకున్నారు.

భారీ విజయాన్ని అందించినందుకు బీఎన్పీ అగ్ర నాయకత్వం.. దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసింది. విజయోత్సవాలు జరపకూడదని, బదులుగా శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొనాలని, మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియాను స్మరించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. సంయమనం పాటించాలని, శాంతిని కాపాడాలని, ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించాలని విజ్ఞప్తి చేసింది.

కాగా జమాత్-ఎ-ఇస్లామీ వ్యతిరేక కూటమి 68 స్థానాలను గెలుచుకుంది. నేషనల్ సిటిజన్ పార్టీ ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మిగిలిన స్థానాల్లో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నానికల్లా 299 స్థానాలకు సంబంధించిన తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

జమాత్-ఎ-ఇస్లామీ 11 పక్షాల కూటమి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 70 సీట్ల లోపు మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2024 ఆగస్టు నాటి విద్యార్థుల ఆందోళన నుంచి ఉద్భవించిన యువ బ్లాక్‌ని నేషనల్ సిటీజన్ పార్టీ (NCP) కూటమికి చుక్కెదురైంది. ప్రస్తుతానికి ఒక స్థానంలో మాత్రమే గెలిచింది. మరి కొన్ని చోట్ల ఆధిక్యతలో కొనసాగుతోంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular