తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
TSRTC కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల టికెట్ల కష్టాలకు చెక్ పెట్టింది. బస్సు పాస్ ల జారీ విధానంలోనూ కొత్త మార్పులు తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రయాణీకులు ఇకపై కేవలం తమ ఫోటో ద్వారా అన్ని రకాల ఆర్టీసీ సేవలు పొందే అవకాశం కల్పించింది. వెయిటింగ్ .. క్యూ లైన్ల సమస్యనే ప్రయాణీకులకు కావాల్సిన విధంగా సేవలు లేకుండా తాజాగా తీసుకున్న నిర్ణయంతో వెసులుబాటు కలగనుంది. నిమిషాల్లోనే ప్రయాణీకులకు ఈ సేవలు సిద్దమయ్యాయి.
తెలంగాణ ఆర్టీసీ తాజాగా స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా బస్ టికెట్లు.. బస్ పాస్ లు పొందే విధంగా అవకాశం కల్పించింది. ఈ యాప్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ఇంటర్ సిటీ బస్సుల టికెట్లను పొందే అవకాశం కల్పించారు. తెలంగాణ ఆర్టీసీలో ప్రస్తుతం 1,710 బస్సులను ముందస్తుగా ఆన్ లైన్ రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంది. వీటి ద్వారా దాదాపు ప్రతీ రోజు 13 వేల మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక.. ఈ బస్సుల్లో రిజర్వేషన్ యాప్ ను చేసుకునే వెసులుబాటు కలిగింది. ఈ యాప్ నుంచి కూడా టికెట్లు తీసుకోవచ్చు. డిజిటల్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత క్యూఆర్ కోడ్ చూపిస్తే సరిపోతుందని అధికారులు గుర్తించారు. అదే విధంగా అయిదు కేటగిరీల బస్ పాసులు సైతం ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎక్స్ ప్రెస్, మెట్రోడీలాక్స్, గ్రీన్ మెట్రో లగ్జరీ, ఆర్డినరీ, పుష్పక్ ఏసీ పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ అయిదుకేటగిరీల సిటీ బస్‌పాస్‌లను డిజిటల్ రూపంలో కొత్తగా ప్రవేశపెట్టింది.

ప్రయాణీకులకు యాప్ ద్వారా అన్ని రకాల సేవలు
బస్ పాసుల రెన్యువల్ చేసుకోవటానికి ఈ యాప్ సహాయం చేస్తుంది. దీని ద్వారా ఇక నుంచి బస్ పాస్ ప్రయాణం సమయంలో దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదు. టీ-24 టికెట్ తీసుకుని హైదరాబాద్‌లో చేసే వారు ఈ యాప్ ద్వారా పొందేందుకు అవకాశం. కాగా, తాజాగా తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా బుక్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు రాయితీలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా వస్తాయి. యాప్ లో మొబైల్ నంబర్ తో లాగిన్ అయిన తరువాత.. పాస్ కావాలనుకుంటే టీజీఆర్టీసీ పై క్లిక్ చేయాలి. కావాల్సిన కేటగిరీలను ఎంపిక తరువాత.. వన్ డే పాస్ క్లిక్ చేయగానే జెండర్ సెలక్ట్ చేసుకుని అక్కడ అడిగిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. పే, గూగుల్ ప్లే ద్వారా పేమెంట్ చేస్తే స్కానర్ అందుబాటులోకి వస్తుందని అధికారులు ఫోన్ చేస్తారు. ప్రయాణ సమయంలో టికెట్ తో అవసరం లేకుండా.. క్యూ ఆర్ కోడ్ చూపించడం ద్వారా రాకపోకలు సాగించమని చెప్పారు.

