Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణపసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం..!! | 6.0 తీవ్రతతో భూకంపం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో...

పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం..!! | 6.0 తీవ్రతతో భూకంపం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 515 కి.మీ లోతులో భూకంపం సంభవించింది

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

ఓయ్-చంద్రశేఖర్ రావు

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవించింది. దీని ధాటికి సముద్రం అల్లకల్లోలంగా తయారైంది. తీర ప్రాంత దేశాలను వణికించింది. ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణనష్టంగానీ నమోదు కాలేదు. తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చినట్లుగా సమాచారం అందింది. పలుచోట్ల బీచ్ ల నుంచి సందర్శకులను ఖాళీ చేయించారు. వాటిని తాత్కాలికంగా మూసివేశారు.

ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కెల్ పై 6.0 నమోదైంది. సముద్ర నిర్వహణ నుంచి 515 అడుగుల లోతులో టెక్టానిక్ ప్లేట్లల్లో సంభవించిన భారీ కదలికల నేపథ్యంలో భూమి ప్రకోపించింది. భారత కాలమానం ప్రకారం వేకువజామున 2:14 21.15 దక్షిణ రేఖాంశం, 178.28 నిమిషాల్లో పశ్చిమ అక్షాంశం పరిధిలోకి ఈ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ నమోదు. ఈ మేరకు ఎక్స్ లో దీనికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేసింది.

6 0 భూకంపం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 515 కి.మీ లోతులో భూకంపం సంభవించింది

ప్రపంచంలోనే అత్యంత చురుకుగా ఉండే భారీ భూకంపాలకు నిలయమైన రింగ్ ఆఫ్ ఫైర్ స్థాయిలో ఉంటుంది పసిఫిక్ మహాసముద్రం. భూమిపై సంభవించే అతిపెద్ద భూకంపాలలో దాదాపు 81 శాతం ఈ ప్రాంతంలోనే చోటు చేసుకుంటాయి. ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్.. టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుల వెంబడి ఉంది. ఇక్కడ సముద్రపు క్రస్ట్‌తో కూడిన ప్లేట్లు మరొక ప్లేట్ కిందకి సబ్‌డక్షన్ అవుతుంటాయి. ఈ సబ్‌డక్షన్ జోన్‌లలో ప్లేట్ల మధ్య రాపిడి, వాటి లోపల చీలికల కారణంగా భూకంపాలు ఉన్నాయి.

పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పొడవు.. సుమారు 40,000 కి. వెడల్పు 500 కి. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువ ఆవరించి ఉంటుంది. దాని భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది. సబ్డ జోన్‌ల ద్వారా ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఏర్పడింది. సుమారు 115 మిలియన్ సంవత్సరాల క్రితం దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆసియా దేశాలలో ఈ ప్రక్రియ మొదలైంది. ప్లేట్ల జోన్ నిర్మాణం క్రమంగా మారుతున్న కొద్దీ, ఇండోనేషియా, న్యూ గినియాలోని సబ్‌డక్షన్‌లు సుమారు 70 మిలియన్ సంవత్సరాల క్రితం, చివరగా న్యూజి సబ్‌డక్షన్ జోన్ సుమారు 35 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి.





Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular