తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
తెలంగాణ రాష్ట్రం ఫ్యూచర్ సిటీలో భాగంగా అభివృద్దిలో పరుగులు పెడుతోంది. త్వరలో తెలంగాణలో విమానాశ్రయాలు రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అదే శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్… కాగా తెలంగాణలో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇటీవల తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం నుంచి అనుమతి లభించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు స్థానిక ఎంపీ మాస్టర్ ప్లాన్ విడుదల చేశారు.
తెలంగాణలో ప్రస్తుతం ఒక్కటే ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాలను అభివృద్ధి చేయడానికి పనులను వేగవంతం చేస్తోంది. వరంగల్ లో మామునూరు విమానాశ్రయం నిర్మాణ కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ ఫ్లయింగ్ స్కూల్ ఏర్పాటుతో పాటు వాణిజ్య విమాన సర్వీసుల కోసం రన్ వే విస్తరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఎయిర్ పోర్ట్ కు సంబంధించి ప్రస్తుతం భూసేకరణ పనులు జరుగుతున్నాయి.
అయితే తాజాగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పై కీలక ప్రకటన వెలువడింది. ఈ ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌కు కేంద్రం నుంచి అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎంపీ గోడం నరేష్ తాజాగా మస్టార్ ప్లాన్‌ను విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభమవుతాయని. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నాగేష్ ఇటీవల విడుదల చేశారు.

ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ది చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఎంపీ అన్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ది చెందుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ పార్క్ కోసం మరో 10 వేల ఎకరాలను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఇది ఓ చరిత్రాత్మక మైలురాయి అని తెలిపారు. త్వరలోనే విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అనేక రంగాల్లో ముందడుగు వేస్తోందన్నారు. మౌళిక సహాయకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎంపీ గోడం నగేష్ స్పష్టం చేశారు. వాటి ఫలితమే ఈ ముందడుగన్నారు.

