Sunday, April 26, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణలోని హన్మకొండతో సహా ఆ నగరాలకు కేంద్రం శుభవార్త! | తెలంగాణ జిల్లాల్లోని హన్మకొండ, నిజామాబాద్,...

తెలంగాణలోని హన్మకొండతో సహా ఆ నగరాలకు కేంద్రం శుభవార్త! | తెలంగాణ జిల్లాల్లోని హన్మకొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో తిండి వీధుల్లో.. కేంద్రం శుభవార్త చెప్పింది.

📰 Generate e-Paper Clip


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

తెలంగాణాలో మంచి ఆరోగ్యకరమైన రాష్ట్రంగా మారాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. ఈ ప్రయోజనాలే ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడం కోసం “హెల్తీ అండ్ హైజినిక్ ఫుడ్ స్ట్రీట్స్” ఏర్పాటుకు కేంద్రం సంకల్పించింది. బయట తినాలి అంటే పరిశుభ్రత, వాడే పదార్థాలపై ప్రతీ ఒక్కరికీ అనుమానం ఉన్న సమయంలో కేంద్రం దేశ వ్యాప్తంగా ఫుడ్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయాలని, మంచి హైజీనిక్, హెల్డీ ఫుడ్స్ అందించాలని నిర్ణయించింది.

కేంద్రం ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటు

దేశంలో 100ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 86కేంద్రాలకు అనుమతులు లభించాయి. ఈ స్ట్రీట్ ఫుడ్స్ తెలంగాణా రాష్ట్రంలోనూ మూడు చోట్ల ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమయ్యింది.ఈ స్ట్రీట్ ఫుడ్స్ ఒక్కో ఫుడ్ స్ట్రీట్ ఏర్పాటుకు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రూ. 1కోటి నిధులు ఇస్తున్నారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా శుభ్రమైన వాతావరణంలో, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించటం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

తెలంగాణా జిల్లాల్లోని ఆహార వీధులు హన్మకొండ నిజామాబాద్ మహబూబ్‌నగర్ సెంటర్‌లో శుభవార్త చెప్పింది

తెలంగాణాలో ఈ నగరాలలో ఫుడ్ స్ట్రీట్స్

ఈ ప్రణాళికలో భాగంగా తెలంగాణలోని హన్మకొండ, నిజామాబాద్,మహబూబ్ నగర్ నగరాల్లో ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల్లో ప్రాంగణం మొత్తం టైల్స్‌తో నిర్మించి, దుమ్ము, ధూళి లేకుండా ఏర్పాట్లు చేస్తారు. రాత్రివేళల్లో ఆకర్షణీయమైన లైటింగ్ ఏర్పాటు చేసి కుటుంబాలతో కలిసి ఆహ్లాదకరంగా ఉండేలా వాతావరణం కల్పిస్తారు.

స్టాల్స్ నిర్వహించాలి అంటే ఇలా చెయ్యాల్సిందే

స్టాల్స్ కేటాయింపులో కఠిన నిబంధనలు అమలు చేయబడతాయి. ఇక ఈ స్ట్రీట్ ఫుడ్స్ FSSAI సర్టిఫికెట్ ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఆరోగ్యానికి పరిశుభ్రతపైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. వంట చేసేవారు గ్లోవ్స్, ఆప్రాన్ ధరించడం తప్పనిసరి. ఈ ఫుడ్ స్ట్రీట్‌లో ఆహార పదార్థాలు గోర్లు పెంచుకోవడం, ఉంగరాలు ధరించడం, పొగాకు లేదా సిగరెట్లు వాడటం పూర్తిగా నిషేధం.

అధికారుల నిరంతర పర్యవేక్షణ

ఇక వీటిపై అధికారులు మానిటర్ చేస్తారు. ఫుడ్ స్పెక్టర్లు ముడిసరుకులు మరియు తయారైన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారు. పానీయం కోసం వాటర్ ప్లాంట్ల ద్వారా శుద్ధజలం, చేతులు కడుక్కోవడానికి ప్రత్యేక వాష్ ఏరియాలు ఏర్పాటు చేస్తారు. అలాగే సౌకర్యవంతమైన బెంచీలు ఏర్పాటు చేసి కుటుంబాలతో కలిసి సురక్షితంగా భోజనం చేసే అవకాశం కల్పిస్తారు.

ఆరోగ్యంగా, పరిశుభ్రంగా మీ స్ట్రీట్ ఫుడ్

ఈ ప్రాజెక్ట్ ద్వారా స్ట్రీట్ ఫుడ్‌కు కొత్త గుర్తింపు లభించడంతో పాటు, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కూడా ఇది కీలకం. రుచితో పాటు శుభ్రమైన నగరాలకు ప్రాధాన్యత ఇస్తూ, తెలంగాణ ఆహారాన్ని ఏర్పాటు చేసే ఫుడ్ స్ట్రీట్ ఇకపై ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ప్రదేశంలో ఆహారాన్ని అందిస్తుంది. మీ స్ట్రీట్ ఫుడ్ కోరికలను తీరుస్తుంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular