Sunday, April 19, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణతిరుమల పరకామణి చోరీపై మళ్ళీ ఎఫ్ఐఆర్.. చంద్రబాబు కుట్ర: భగ్గుమన్న భూమన | తిరుమల పరకామణి...

తిరుమల పరకామణి చోరీపై మళ్ళీ ఎఫ్ఐఆర్.. చంద్రబాబు కుట్ర: భగ్గుమన్న భూమన | తిరుమల పరకామణి చోరీ కేసులో షాకింగ్ న్యూస్, చంద్రబాబుపై భూమన సంచలన వ్యాఖ్యలు

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

పరకామణి చోరీ కేసు, లడ్డు నెయ్యి కల్తీడ్డు కోసం టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల పరకామణి కేసులో మళ్లీ ఎఫ్ఐఆర్ వేయడానికి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, అందులో వైసిపి నేతలను నిందితులుగా చేర్చడానికి ఒక డిఎస్పీకి బాధ్యతలు కూడా ఇచ్చారని టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

పరకామణి చోరీ విషయంలో మరో కుట్ర: భూమన ఫైర్

రెండు రోజుల్లోనే మళ్లీ టిటిడితో ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారని, ఈ విషయం పైన తనకు ఉందని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి వైసీపీ తర్వాత మీడియాతో మాట్లాడిన భూమన పరకామణి కేసులో ఇప్పటికే విచారణ జరిపి కోర్టుకు నివేదిక సమర్పించిన తర్వాత మళ్లీ ఒక డీఎస్పీ స్థాయి అధికారికి విచారణ బాధ్యతలు అప్పగించారని, వారికి కావలసిన విధంగా నివేదిక తయారు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తిరుమల పరకామణి చోరీ కేసులో షాకింగ్ న్యూస్ చంద్రబాబుపై భూమన సంచలన వ్యాఖ్యలు

సుప్రీం నిర్ణయంపైనే చంద్రబాబు ధిక్కారం

వైసిపి నేతలను టార్గెట్ చేసి సీఎం ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టుగా భూమన తెలిపారు.సుప్రీం ప్రకటించింది. సుప్రీంకోర్టు సిట్ విచారణపై నమ్మకం లేక, ఏకసభ్య కమిషన్ వేశారని చంద్రబాబు తీసుకునే నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సైతం తప్పు పడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

బూట్లు వేసుకుని శ్రీవారి విగ్రహాలను ఇచ్చే చంద్రబాబు

సుప్రీంకోర్టు సైతం మొట్టికాయలు వేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపై శాసనమండలిలో వైసిపి సభ్యులు దేవుడు చిత్రపటాలను తీసుకువెళ్లడంపై జరుగుతున్న రాద్ధాంతం పైన భూమన స్పందించారు. చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకుని శ్రీవారి విగ్రహాలను పలువురికి బహుమతులుగా ఇచ్చారని అప్పుడు తప్పు కానిది ఇప్పుడు ఎందుకు తప్పు అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు.

అప్పుడు క్లెమోర్ మైన్స్ పేలింది అందుకే చంద్రబాబు

అపచారాలు చంద్రబాబు చేస్తూ ఎదుటి వారి పైన నెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఉంది. అలిపిరి వద్ద తనపై జరిగిన దాడి పైన పదేపదే మాట్లాడితే చంద్రబాబు తిరుమల శ్రీవారే దిగొచ్చి తనను కాపాడాడని చెప్పుకుంటారు అని, తాను చేసిన పాపాల వల్లే క్లెమోర్ మైన్స్ పేలాయని ఎందుకు అనుకోరు అని ప్రశ్నించారు.

ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వివరిస్తాం

కల్తీ నెయ్యి మూలాలు చంద్రబాబు సొంత హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల దగ్గరే ఉన్నాయని వీటిపై మరింతగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వివరిస్తామని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలకు చేసినా, ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా సత్యం దాగి ఉండదని భగవంతుడు, న్యాయస్థానాలు చంద్రబాబుకు బుద్ధి చెప్పడం ఖాయమని భూమన ప్రస్తావన.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular