Monday, March 2, 2026
ads
📄 ePaper
Homeజాతియండోన్ లో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం

డోన్ లో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం

📰 Generate e-Paper Clip

డోన్ టౌన్, ఫిబ్రవరి 02, (సీమకిరణం న్యూస్):

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు అనుచితమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సోమవారం డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద కూటమి నాయకులు మరియు కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తూ, ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, రాష్ట్ర ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని నాయకులు పేర్కొన్నారు. ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం తగదని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి అసభ్య రాజకీయ వ్యాఖ్యలకు చోటు లేకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కూటమి నాయకులు వలసల రామకృష్ణ, పనిరాజు, ఓం ప్రకాష్, చనుగొండ్ల శ్రీరాములు, జయరాముడు, రవి, సలింద్ర శ్రీనివాసులు, భూమ నాగన్న కార్యకర్తలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular