ఆంధ్ర ప్రదేశ్
-సాయి చైతన్య
పార్లమెంట్ సాక్షిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. అవిశ్వాసం నోటీసులపై 119 మంది ఎంపీలు సంతకాలు చేశారు. కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ ఎంపీలు సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. అయితే ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు అవిశ్వాసం నోటీసులపై సంతకాలు చేసేందుకు ఒప్పుకోలేదు. ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు టీఎంసీ నిరాకరిం చింది. కాగా.. ఈ అంశంలో వైసీపీ మద్దతు ఎవరికి.. ఓటింగ్ వేళ ఎవరి వైపు నిలువనేది ఆసక్తిగా మారుతోంది.
పార్లమెంట్ సమావేశాల్లో ఆసక్తికర పరిణామాలు తెర మీదకు వచ్చాయి. సభలో తాము మాట్లాడేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి లేదంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజా బడ్జెట్ సమావేశాల సందర్భంగా 8 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. భారత్-చైనా ఉద్రిక్తతలకు సంబంధించి ఆర్మీ మాజీ చీఫ్ నరవణె అముద్రిత పుస్తకంలోని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో ఎంపీలు నిరసనలకు దిగి సస్పెన్షన్‌కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ తీరుపై ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానానికి సిద్దమైంది. సాధారణంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 14 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఆ ప్రకారం బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. కాగా, రెండో విడత సమావేశాలు మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగుతున్నాయి.

ఓటింగ్ లో వైసీపీ ఎవరి వైపు
అయితే, మాజీ ప్రధానమంత్రిలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబాయ్‌పై చర్యలు తీసుకోకపోవడాన్ని కూడా ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. అయితే, ఇండియా కూటమిలోనే స్పీకర్ పైన అవిశ్వాసం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీ జరిగింది. రెండు నుంచి మూడు రోజుల్లో స్పందన రాకపోతే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని టీటీడీ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ నుంచి లోక్ సభ లో బీఆర్ఎస్ కు ప్రాబల్యం లేదు. కాంగ్రెస్ – బీజేపీలు తమ పార్టీల వైఖరికి కట్టుబడి ఓటింగ్ లో పాల్గొంటారు. ఏపీలో టీడీపీ-బీజేపీ- జనసేన కూటమికి చెందిన 21 మంది ఎండీఏకు అనుకూలంగా నిలిచారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం కాంగ్రెస్ ప్రతిపాదనలకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. మరి.. ఇప్పుడు జగన్ ఎవరి వైపు. ఉపరాష్ట్రపతి ఎన్నికల తరహాలో మరోసారి ఎన్డీఏ వైపే నిలుస్తున్నారా… రాష్ట్రంలో నెలకున్న రాజకీయ పరిణామాలతో భిన్నమైన నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.

