Thursday, March 5, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఘజియాబాద్ బాలికల ఆత్మహత్య కేసు.. ముగ్గురు భార్యల కథ.. షాకింగ్ ట్విస్ట్ లు | ఘజియాబాద్...

ఘజియాబాద్ బాలికల ఆత్మహత్య కేసు.. ముగ్గురు భార్యల కథ.. షాకింగ్ ట్విస్ట్ లు | ఘజియాబాద్ సోదరీమణుల ఆత్మహత్య కేసు. తండ్రి మరణాల కేసులో ముగ్గురు భార్యల కథ షాకింగ్ ట్విస్ట్‌లను చెప్పారు

📰 Generate e-Paper Clip


భారతదేశం

-డాక్టర్ వీణా శ్రీనివాస్

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వస్తున్నాయి. ఈ కేసులో ముందు డిజిటల్ వ్యసనంతో ఫోన్లు లాక్కున్నారని ముగ్గురు అక్కచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారని భావించినట్లుగా, దర్యాప్తు చేస్తున్న ఈ కేసు దర్యాప్తు కొత్త మలుపులు తిరుగుతోంది.

ముగ్గురిని పెళ్లి చేసుకున్న బాలికల తండ్రి

బాలికల తండ్రి చేతన్‌కుమార్‌ ఇచ్చిన వాంగ్మూలాలు పోలీసులను షాక్‌కి గురిచేస్తున్నాయి. అతను చెప్పినవి వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. తాను పెళ్లి చేసుకున్న ముగ్గురు మహిళలు సోదరీమణులని అతడు ముందుగా చెప్పాడు. కానీ అతని భార్యలు ముగ్గురు అక్క చెల్లెళ్ళు కాదని దర్యాప్తులో తేలినట్లు తెలిసింది. మూడో భార్య టీనా 2018లో చేతన్ దగ్గర ఉద్యోగం చేస్తుందని, తర్వాత వారి పెళ్లి చేసుకున్నట్టుగా పేర్కొన్నారు.

ఘజియాబాద్ సోదరీమణుల ఆత్మహత్య కేసులో తండ్రి, ముగ్గురు భార్యల కథ ఈ మరణాల కేసులో షాకింగ్ మలుపులు

చేతన్ మూడు పెళ్ళిళ్ళపై దర్యాప్తు

అప్పటికే చేతన్ కు రెండు పెళ్లిళ్లు జరిగినట్టు నిర్ధారించారు. అయితే అతడిని విచారిస్తున్నాడు అతను 2010లో సుజాతను, సంతానం లేకపోవడంతో 2013లో హీనాను వివాహం చేసుకున్నట్లుగా పేర్కొన్నాడు. కానీ మొదటి భార్య పదహారేళ్ల కుమార్తె ఉండటంతో చేతన్ వామూలం పైన అధికారులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అతని వివాహ పత్రాల ద్వారా మూడు వివాహాల తేదీల పైన దర్యాప్తు జరుపుతున్నారు.

చేతన్ వాంగ్మూలం పొంతన లేకపోవటంతో దర్యాప్తులో గందరగోళం

మరోవైపు 2015లో చేతన్‌తో సహజీవనం చేసిన ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా వెల్లడైంది. ముగ్గురు అక్క చెల్లెల ఆత్మహత్య కేసులో, తండ్రిగా చెప్పబడే చేతన వివాహాలకు సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకి రావడంతో పాటు, అతను ఇచ్చిన వాంగ్మూలం పొంతన లేకుండా విచారణలో మరింత గందరగోళం ఏర్పడింది. అసలు చేతన్ ఎందుకు ఇలా చెబుతున్నాడు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్యలకు ముందు బాధితుల ఫోన్లు విక్రయం

త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో నివసించిన వారు ఘటన సమయంలో అందరూ ఒకే గదిలో ఎందుకు నిద్రించారు అన్నది కూడా అనుమానస్పదంగా ఉంది. చేతన్ ఆర్థిక సమస్యల కారణంగా పిల్లలను స్కూల్ మాన్పించాం అని చెప్పగా, ఆత్మహత్య చేసుకున్న కొద్ది రోజుల ముందు బాధితులు వారి ఫోన్లను అమ్మేయడం అనేక సందేహాలకు కారణమైంది.

ఫోన్స్ లో ఏముందో రికవరీ చేస్తున్న పోలీసులు

దీనితో అసలు వారి ఫోన్లలో ఏముంది అనేది తెలుసుకోవడం కోసం పోలీసులు టెక్నాలజీ సహాయంతో రికవరీ చేయడానికి ప్రయత్నించారు. ఈ కేసులో ఏం జరిగింది అన్నది అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఊహించని ట్విస్టులతో, అనుకోని మలుపులతో ఈ కేసు పోలీసులకు పెద్ద సవాల్ విసురుతోంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular